Yash Dayal : చిక్కుల్లో ఆర్‌సీబీ స్టార్ పేస‌ర్ య‌శ్ ద‌యాళ్.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడ‌ని సీఎంకు యువ‌తి ఫిర్యాదు..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ య‌శ్ ద‌యాళ్ పై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది

RCB pacer Yash Dayal in major trouble after woman accuses him of exploitation

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ య‌శ్ ద‌యాళ్ పై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. అత‌డు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని పేర్కొంది. అత‌డి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా అత‌డు త‌న‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడ‌ని తెలిపింది. ఈ సమయంలో తాను భావోద్వేగపరంగా, మానసికంగా, శారీరకంగా దోపిడీకి గురయ్యానని ఆ యువ‌తి తన ఫిర్యాదులో పేర్కొంది. త‌న‌ను అత‌డి కుటుంబానికి కోడలిగా పరిచయం చేశాడ‌ని తెలిపింది. దీంతో అత‌డిని పూర్తిగా న‌మ్మాన‌ని చెప్పింది. అత‌డు ఇత‌ర మ‌హిళ‌ల‌తో సంబంధాలు పెట్టుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Asia Cup 2025 : సెప్టెంబ‌ర్ 10 నుంచి ఆసియా క‌ప్‌! భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ ఉంటుందా?

2025 జూన్ 14న మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కి ఫోన్ చేసినట్లు ఆమె పేర్కొంది. అయితే.. పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించింది. దీంతో న్యాయం కోసం సీఎం కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించిన‌ట్లు తెలిపింది. త‌న ఆరోప‌ణ‌లకు సంబంధించిన సాక్ష్యాల‌ను పోలీసులకు ఆధారాలుగా చూపించిన‌ట్లు తెలిపింది. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

కాగా.. యువ‌తి చేసిన ఫిర్యాదు పై సీఎం కార్యాల‌యం ఘ‌జియాబాద్‌లోని ఇందిరాపురం స‌ర్కిల్ ఆఫీస‌ర్ నుంచి నివేదిక కోరిన‌ట్లు తెలుస్తోంది.

Team India : ఏం చేస్తున్నారబ్బా.. ప్రాక్టీస్ చేయంటే.. WWE స్టైల్‌లో బౌలింగ్ కోచ్‌ను కొడ‌తారా? అర్ష్‌దీప్, ఆకాశ్ ఇదేం ప‌ని..

ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తొలిసారి టైటిల్‌ను గెలుచుకోవ‌డంలో య‌శ్ ద‌యాళ్ త‌న వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు.