ఏం చేస్తున్నారబ్బా.. ప్రాక్టీస్ చేయమంటే.. WWE స్టైల్‌లో బౌలింగ్ కోచ్‌ను కొడ‌తారా? అర్ష్‌దీప్, ఆకాశ్ ఇదేం ప‌ని..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్ కోసం భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది.

ఏం చేస్తున్నారబ్బా.. ప్రాక్టీస్ చేయమంటే.. WWE స్టైల్‌లో బౌలింగ్ కోచ్‌ను కొడ‌తారా? అర్ష్‌దీప్, ఆకాశ్ ఇదేం ప‌ని..

Viral Video Morne Morkel physically attacked by Arshdeep Singh and Akash Deep

Updated On : June 29, 2025 / 12:45 PM IST

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్ కోసం భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది. హెడింగ్లీలో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఐదు వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ క్ర‌మంలో ఎడ్జ్‌బాస్టన్‌లో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

శనివారం నిర్వ‌హించిన నెట్ సెష‌న్‌లో అర్ష్‌దీప్ సింగ్‌, ఆకాష్ దీప్‌ల‌తో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్ సైతం నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ క‌నిపించారు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త తుది జ‌ట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Asia Cup 2025 : సెప్టెంబ‌ర్ 10 నుంచి ఆసియా క‌ప్‌! భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ ఉంటుందా?

ఇక ఈ సెష‌న్‌లో భార‌త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌, పేస‌ర్లు అర్ష్‌దీప్ సింగ్‌, ఆకాష్ దీప్‌లు స‌ర‌దాగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు కూడా స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేయ‌మంటే బౌలింగ్ కోచ్‌ను కొడుతున్నారా ? లేక తుది జ‌ట్టులో అవ‌కాశం కోసం కొడుతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. భార‌త జ‌ట్టుకు ఊర‌ట‌.. గంభీర్ ఏం చేస్తాడో మ‌రీ..

అర్ష్‌దీప్ సింగ్ అరంగ్రేటం..
ఇక రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అర్ష్‌దీప్ సింగ్ అరంగ్రేటం చేయ‌నున్నాడు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌ర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్ర‌ధాన పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు. అత‌డి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగ్రేటం చేసే ఛాన్స్ ఉంది. అలాకాకుండా.. తొలి టెస్టులో ధారాళంగా ప‌రుగులు ఇచ్చిన ప్ర‌సిద్ధ్ కృష్ణ స్థానంలోనైనా అర్ష్ దీప్ ఆడొచ్చు.