RCB team director provides massive injury update on Rajat Patidar ahead of KKR clash
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. మరోవైపు బెంగళూరు చేతిలో ఓడిపోతే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అన్నదానిపై ఆ జట్టు డైరెక్టర్ మో బోబాట్ అప్‌డేట్ ఇచ్చాడు.
ఐపీఎల్ వాయిదా పడడం రజత్‌కు కలిసి వచ్చిందన్నాడు. కోలుకోవడానికి సమయం లభించదని తెలిపాడు. అతడు దాదాపుగా కోలుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ కెప్టెన్ గత కొన్ని రోజులుగా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారు.
‘రజత్ బాగానే ఉన్నాడు. అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్ వాయిదా పడడం వ్యక్తిగతంగా అతడికి కలిసివచ్చింది. నొప్పి, వాపు తగ్గేందుకు సమయం లభించింది. అతడు బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేయగలుగుతున్నాడు. అతడు నెట్స్‌లో సౌకర్యవంతంగానే కనిపిస్తున్నాడు.’ అని బోబాట్ ప్రెస్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పాడు.
అంటే ఆర్‌సీబీ కెప్టెన్ కోలుకున్నాడని, కేకేఆర్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ వేలికి గాయమైంది. వాస్తవానికి ఐపీఎల్ వాయిదా పడకుండా షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే అతడు కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యేవాడు. దాదాపు 10 రోజుల సమయం దొరకడంతో అతడు కోలుకున్నాడు.
రజత్ పాటిదార్ సారథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రజత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 11 మ్యాచ్‌లలో 23.90 సగటుతో 140.59 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు సాధించాడు.