Mumbai Indians : ప్లేఆఫ్స్‌కు ముందు ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్..! టీమ్‌లోకి విధ్వంసకర వీరుడు..
ర్యాన్ రికెల్టన్, విల్‌జాక్స్ స్థానాల్లో ముంబయి ఇండియన్స్ జట్టులోకి..

Bairstow set to replace Will Jacks in Mumbai Indians squad for IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ వరుస ఓటములను చవిచూసింది. అయితే.. ఆ తరువాత గొప్పగా పుంజుకుంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది.
ఇప్పటి వరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +1.156గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్ దశలో ముంబై మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. అయితే.. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. భారత్, పాక్ ఉద్రికత్తల మధ్య వాయిదా పడిన ఐపీఎల్ 2025 శనివారం (మే 17) నుంచి ప్రారంభం కానుంది. అయితే.. కొన్ని కారణాల విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్‌లో పాల్గొనలేకపోతున్నారు. ఇంకొందరు తొలుత చేసుకున్న ఒప్పందం ప్రకారం మే 27 వరకు మాత్రమే ఆయా జట్లకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లతో స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడనుండడంతో ర్యాన్ రికెల్టన్, వెస్టిండీస్‌తో సిరీస్ కోసం విల్ జాక్స్ వెళ్లనున్నారు. వీరిద్దరు ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ వీరిద్దరి స్థానాల్లో జానీ బెయిర్ స్టో, రిచర్డ్ గీసన్ లను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్‌లో జానీ బెయిర్‌స్టో గతంలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. రిచర్డ్ గ్లీసన్ ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. ఆ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.