Tim David : వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే బ‌ట్ట‌లు విప్పేసి మ‌రీ.. ‘నువ్వు టిమ్‌డేవిడ్ కాదురా.. స్విమ్ డేవిడ్‌వి..’ వీడియో

వ‌ర్షం వ‌స్తుండ‌గా ఆర్‌సీబీ ఆట‌గాడు టిమ్ డేవిడ్ చేసిన ప‌ని వైర‌ల్ అవుతోంది.

Tim David : వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే బ‌ట్ట‌లు విప్పేసి మ‌రీ.. ‘నువ్వు టిమ్‌డేవిడ్ కాదురా.. స్విమ్ డేవిడ్‌వి..’ వీడియో

IPL 2025 Tim David enjoying the Bengaluru rain

Updated On : May 16, 2025 / 10:09 AM IST

శ‌నివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో విదేవీ ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా భార‌త్‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చెందిన ఆట‌గాళ్లు అంద‌రూ జ‌ట్టులో చేరిపోయారు. విదేశీ ఆట‌గాళ్లు సైతం వ‌చ్చేశారు.

బెంగ‌ళూరులో చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా శ‌నివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఇప్ప‌టికే బెంగళూరుకు చేరుకున్నారు. ప్రాక్టీస్ చేసుకునేందుకు గురువారం చిన్న‌స్వామి స్టేడియానికి ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వెళ్లారు. అయితే.. ప్రాక్టీస్ చేస్తుండ‌గా వ‌ర్షం మొద‌లైంది. దీంతో ప్రాక్టీస్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌లు త‌డ‌వ‌కుండా ఉండేందుకు క‌వ‌ర్లు క‌ప్పారు.

ENG vs IND : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే.. రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయ‌ర్‌.. జ‌ట్టులో ఎవరికి ఛాన్స్ ద‌క్కిందంటే..?

భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో పిచ్‌లు త‌డ‌వ‌కుండా ఏర్పాటు చేసిన క‌వ‌ర్ల పై పెద్ద మొత్తంలో నీళ్లు నిలిచాయి. కాగా.. ఆస్ట్రేలియా ఆట‌గాడు టిమ్ డేవిడ్ మాత్రం బ‌ట్ట‌లు విప్పేసి చిన్న‌పిల్లాడిలా వ‌ర్షంలో త‌డిశాడు. క‌వ‌ర్ల‌పై ఉన్న నీళ్ల‌ను స్విమ్మింగ్ పూల్‌గా భావించాడేమో.. ఏంచ‌క్క‌గా డైవింగ్ చేసిన‌ట్లుగా చేశాడు.

IPL 2025 : రేప‌టి నుంచే ఐపీఎల్ 2025 రీస్టార్ట్‌.. 7జ‌ట్లు.. 4 బెర్తులు.. ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణం ఇలా..

ఇందుకు సంబంధించిన వీడియోను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘టిమ్ డేవిడ్ కాదు.. స్మిమ్ డేవిడ్‌. వ‌ర్షం డేవిడ్ స్పిరిట్‌ను ఏ మాత్రం అడ్డుకోలేక‌పోయింది.’ అంటూ ఆ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.