IPL 2025 : రేప‌టి నుంచే ఐపీఎల్ 2025 రీస్టార్ట్‌.. 7జ‌ట్లు.. 4 బెర్తులు.. ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణం ఇలా..

శ‌నివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది.

IPL 2025 : రేప‌టి నుంచే ఐపీఎల్ 2025 రీస్టార్ట్‌.. 7జ‌ట్లు.. 4 బెర్తులు.. ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణం ఇలా..

IPL 2025 playoffs scenarios explained 7 teams 4 spots

Updated On : May 16, 2025 / 9:43 AM IST

దాదాపు తొమ్మిది రోజుల విరామం త‌రువాత శ‌నివారం (మే 17) నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్ర్క‌మించాయి. నాలుగు బెర్తుల కోసం ఏడు జ‌ట్లు పోటీలో ఉన్నాయి.

ఏ జ‌ట్టుకు అవ‌కాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

గుజ‌రాత్ టైటాన్స్‌..
ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.793గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో గుజ‌రాత్ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో క‌నీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా 18 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌డం ఖాయం.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..
ఆర్‌సీబీ సైతం 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.482గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో ఆర్‌సీబీ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో క‌నీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా 18 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది.

ENG vs IND : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే.. రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయ‌ర్‌.. జ‌ట్టులో ఎవరికి ఛాన్స్ ద‌క్కిందంటే..?

పంజాబ్‌ కింగ్స్‌..
పంజాబ్ కింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఆ జ‌ట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.376గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో పంజాబ్ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌నుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ప్లేఆప్స్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.

ముంబై ఇండియ‌న్స్‌..
ఈ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +1.156గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ ద‌శ‌లో ముంబై మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ముంబై ప్లేఆఫ్స్‌కు దూసుకువెలుతుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా అవ‌కాశాలు ఉంటాయి. అయితే అప్పుడు మిగిలిన జ‌ట్ల ఫ‌లితాలు, నెట్‌ర‌న్‌రేట్ కీల‌కం కానుంది.

Punjab kings : పాక్ లీగ్‌ను వదిలి పంజాబ్ జ‌ట్టులో చేరిన డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఇక దబిడి దిబిడే?

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
ఢిల్లీ క్యాపిట‌ల్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఆరు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఆ జ‌ట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.362గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో క‌నీసం రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 17 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌వ‌చ్చు.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌..
కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడింది. 5 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ప్ర‌స్తుతం కేకేఆర్ ఖాతాలో 11 పాయింట్లు ఉండ‌గా, నెట్‌ర‌న్‌రేట్ +0.193గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో కేకేఆర్ మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఖ‌చ్చితంగా కేకేఆర్ విజ‌యం సాధించాలి. అప్పుడు కూడా ప్లేఆఫ్స్ చేరుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉంటాయి. ఏదైన అద్భుతం జ‌రిగి టాప్‌-4లో ఉన్న జ‌ట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు కేకేఆర్ ప్లేఆప్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది.

Rohit Sharma : శ‌నివారం నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. భారీ రికార్డు పై రోహిత్ శ‌ర్మ క‌న్ను.. ఇంకో 72..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌..
ల‌క్నో జ‌ట్టు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెలవ‌గా, మ‌రో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉండ‌గా, నెట్‌ర‌న్‌రేట్ -0.469గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో ఏడో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో ల‌క్నో మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనే ల‌క్నో గెలిస్తే అప్పుడు 16 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉంటాయి. అయినా కూడా ప్లేఆప్స్‌కు చేరుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉంటాయి. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంది.