Neeraj Chopra : చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్.. అయినా కానీ..
ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

Doha Diamond League Neeraj Chopra finishes 2nd despite creating history
ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో తొలిసారి అతడు 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. ఇంతకముందు అతడి అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమంగ్ లీగ్‌లో ఈ ప్రదర్శనను నీరజ్ చేశాడు.
నీరజ్.. దోహా డైమండ్ లీగ్‌లో మూడో రౌండ్‌లో 90.23 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. తన తొలి ప్రయత్నంలో 88.84 మీటర్ల దూరం విసిరాడు. కానీ.. రెండో రౌండ్‌లో ఫౌల్ అయ్యాడు. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయితే.. జర్మనీ ఆటగాడు జులియన్ వెబర్ ఆఖరి రౌండ్‌లో 91.06 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. దీంతో నీరజ్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
THE HISTORIC MOMENT. 🥶
– Neeraj Chopra breaching the 90m mark with a 90.23m throw. 🔥pic.twitter.com/FFTnyWGaNs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2025
నీరజ్ చోప్రా టాప్-5 ప్రదర్శనలు ఇవే..
దోహా డైమండ్ లీగ్ 2025 – 90.23 మీటర్లు
స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022 – 89.94 మీటర్లు
లౌసాన్ డైమండ్ లీగ్ 2024 – 89.49 మీటర్లు
పారిస్ 2024 ఒలింపిక్స్ ఫైనల్ – 89.45 మీటర్లు
పారిస్ 2024 ఒలింపిక్స్ అర్హత – 89.34 మీటర్లు