RCBvsCSK: బెంగళూరు మళ్లీ గెలిచింది

RCBvsCSK: బెంగళూరు మళ్లీ గెలిచింది

Updated On : April 21, 2019 / 6:13 PM IST

అంచనాలకు మించి బెంగళూరు మరోసారి విజయం చేజిక్కించుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో  తలపడిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో గెలుపొందింది. 

లక్ష్యం చిన్నదే అయినా వరుస వికెట్లు కోల్పోవడంతో  చెన్నై తీవ్రంగా పోరాడింది. మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మహీ(84; 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులు)తో చివరి బంతి వరకూ పోరాడాడు. జట్టులో ధోనీదే హైస్కోరు కాగా, రాయుడు(29) మినహాయించి ఎవ్వరూ చక్కటి స్కోరు నమోదు చేయలేదు. 

క్రీజులో నిలదొక్కుకునే క్రమంలోనే బెంగళూరు బౌలర్లు వికెట్లు పడగొడుతుంటే చెన్నైకు  పెవిలియన్ క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో షేన్ వాట్సన్(5), డుప్లెసిస్(5), సురేశ్ రైనా(0), కేదర్ జాదవ్(9), రవీంద్రజడేజా(11), బ్రావో(5), శార్దూల్ ఠాకూర్(0)పరుగులు చేయగలిగారు.

బెంగళూరు బౌలర్లలో డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్ చెరో 2వికెట్లు పడగొట్టగా, చాహల్, సైనీ తలో ఒక వికెట్ తీయగలిగారు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7వికెట్లు నష్టపోయి 161పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పేలవ ప్రదర్శన చేయడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. పార్థివ్ మినహాయించి జట్టులో ఒక్కరు కూడా 30పరుగులు చేయలేకపోయారు.

చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, బ్రావో తలో 2వికెట్లు తీయగా ఇమ్రాన్ తాహిర్ 1వికెట్ పడగొట్టాడు. 

కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), డివిలియర్స్(25), అక్షదీప్ సింగ్(24), మార్కస్ స్టోనిస్(14), మొయిన్ అలీ(26), పవన్ నేగీ(5), ఉమేశ్ యాదవ్(1), డేల్ స్టెయిన్(0)పరుగులు మాత్రమే చేయగలిగారు.