Reactions galore after Sarfaraz Khan gets left out of India A squad
Sarfaraz Khan : ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా-ఏతో భారత్-ఏ జట్టు తలపడనుంది. తొలుత రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడే భారత్-ఏ జట్టును మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. రిషబ్ పంత్ ను కెప్టెన్‌గా, సాయి సుదర్శన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు సెలక్టర్లు జట్టులో చోటు ఇచ్చారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ట వంటి రెగ్యులర్ ఆటగాళ్లు రెండో అనధికారిక టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు. అయితే.. భారత్-ఏ జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌లకు చోటు దక్కలేదు. దీంతో సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
గాయం కోలుకుని, బరువు తగ్గి ఫిట్‌నెస్ సాధించడంతో పాటు ఇటీవల ముగిసిన రంజీ మ్యాచ్‌లో 42, 32 పరుగులు చేసి పర్వాలేదనిపించిన సర్ఫరాజ్‌కు చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో సర్ఫరాజ్ వరుసగా రెండు శతకాలు బాదాడు. అంతకముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లాండ్ పర్యటన తొలి మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. ఇలా నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం దారుణం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొదటి నాలుగు రోజుల మ్యాచ్ కు భారత్-ఏ జట్టు ఇదే..
రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరన్ష్ జాయిన్.
BCCI : ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్..
రెండవ నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఇండియా A జట్టు..
రిషబ్ పంత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ దే బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
Feel for Sarfaraz Khan…!!!!! 💔
He played in the England tour for India A team, scored 92 runs in first unofficial match but then out of the picture due to injury – improved his fitness, lost lots weight returned to Ranji Trophy (made important 74 runs) but no place in the… pic.twitter.com/cLnMWBipcA
— Johns. (@CricCrazyJohns) October 21, 2025
Sarfaraz Khan scored 92 for India A vs England Lions, then got injured. Came back fitter, lighter, made 74 in Ranji. Still no spot in the India A squad. Tough one to take.💔 pic.twitter.com/ls6gOJdaP6
— Soaib Akhtar (@SSA_807) October 21, 2025
Selection criteria for Sarfaraz Khan is to bat on one leg without holding a bat and score a hundred, that too with at least 80 singles and not more than 2 boundaries.
— Silly Point (@FarziCricketer) October 21, 2025