West Indies : చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. అన్ని ఓవర్లు స్పిన్.. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదేతొలిసారి..
వెస్టిండీస్ (West Indies) జట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అన్ని ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా నిలిచింది.

West Indies Creates history First time a full member nation bowled 50 overs of spin in an ODI
West Indies : వెస్టిండీస్ జట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అన్ని ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా (పూర్తి సభ్య దేశాల్లో) చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ ఈ ఘనత సాధించింది. అకేల్ హోసేన్, రోస్టన్ చేజ్, ఖరీ పియర్, గుడాకేష్ మోటీ, అలిక్ అథనాజ్ లు తలా 10 ఓవర్లు వేశారు.
వన్డే క్రికెట్ చరిత్రలో తొలి నలుగురితో స్పిన్ బౌలింగ్ చేయించిన దాఖలాలు (ఐదు సందర్భాల్లో) ఉన్నా కూడా అవి అసోసియేట్ దేశాల క్రికెట్‌లో జరిగాయి. ఓ ఫుల్ మెంబర్ జట్టు అన్ని ఓవర్లను స్పిన్నర్లతో వేయించడం చరిత్రలో ఇదే తొలిసారి.
🚨 50 OVERS BOWLED BY SPINNERS – FIRST TIME EVER IN ODI HISTORY 🚨
– 10 overs by Akeal.
– 10 overs by Chase.
– 10 overs by Pierre.
– 10 overs by Motie.
– 10 overs by Athanaze.West Indies Spinners at Dhaka against Bangladesh. pic.twitter.com/rxPW1ItGY3
— Johns. (@CricCrazyJohns) October 21, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్య సర్కార్ (45; 89 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రిషద్ హుస్సేన్ (39 నాటౌట్ ; 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెహిది హసన్ మీరాజ్ (32 నాటౌట్; 58 బంతుల్లో 1 ఫోర్) లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో గుడాకేష్ మోటీ మూడు వికెట్లు తీశాడు. అలిక్ అథనాజ్, అకేల్ హోసేన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.