PCB : ఇదేం గందరగోళం సామీ.. 12 నెలల్లో ముగ్గురు కెప్టెన్లు.. టీ20కి పనికిరాడంటా గానీ వన్డే కెప్టెన్సీ ఇచ్చారు..
పాకిస్తాన్ వన్డే కెప్టెన్‌గా పేసర్ షహిన్ షా అఫ్రిదిని పీసీబీ (PCB) నియమించింది.

PCB Rizwan Sacked As Pak ODI Captain Replaced By Shaheen
PCB : పాకిస్తాన్ క్రికెట్‌లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గత 12 నెలల కాలంలో వన్డేల్లో మూడో కెప్టెన్సీ మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు ప్రపంచక్రికెట్‌లో ఓ వెలుగు వెగిలిన పాక్ ప్రస్తుతం అనిశ్చితికి మారు పేరుగా మారింది. పాక్ తలరాను మార్చే, జట్టుకు స్థిరత్వాన్ని తీసుకువచ్చే కెప్టెన్ కోసం పీసీబీ చూస్తోంది.
ఈ నేపథ్యంలోనే మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో పేసర్ షాహన్ షా అఫ్రిదీని పాక్ వన్డే కెప్టెన్‌గా పీసీబీ (PCB) నియమించింది.
12 నెలల్లో మూడో కెప్టెన్..
పాక్ వరుస పరాభవాల నేపథ్యంలో గత అక్టోబర్‌లో బాబర్ ఆజామ్ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను మహ్మద్ రిజ్వాన్‌కు పీసీబీ అప్పగించింది. అయితే.. రిజ్వాన్ సారథ్య బాధ్యతలను చేపట్టిన తరువాత కూడా పెద్దగా మార్పు రాలేదు.
Babar Azam : 100 లేకుండా 1000 పూర్తి చేసుకున్న బాబర్ ఆజామ్..
గతేడాది నవంబర్‌లో ఆసీస్ గడ్డ పై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1తో కైవసం చేసుకుంది. 22 ఏళ్ల తరువాత ఆసీస్ గడ్డపై పాక్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం గమనార్హం.
ఆ తరువాతే అసలు ఆట మొదలైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 3-0 తేడాతో వన్డే సిరీస్‌లో పాక్ వైట్‌వాష్ అయింది. పసికూన జింబాబ్వే పై 2-1 తేడాతో గెలిచినప్పటికి కూడా స్వదేశంలో జరిగిన ట్రై సిరీస్‌లో ఓడిపోయింది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ పాక్ గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించింది. ఆ తరువాత వెస్టిండీస్ పై 2-1 తేడాతో సిరీస్ ఓడిపోయింది. గత 34 ఏళ్లలో కరేబియన్ గడ్డపై వన్డే సిరీస్‌లో ఓడిపోవడం పాక్ ఇదే తొలిసారి.
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఇలా..
వరుస దారుణమైన పరాభవాల నేపథ్యంలోనే రిజ్వాన్ పై వేటు పడింది. ఈ నేపథ్యంలో షహీన్ షా అఫ్రిదీకి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
టీ20 కెప్టెన్సీ ముణ్నాళ్ల ముచ్చటే..
టీ20 ప్రపంచకప్ 2024లో పేలవ ప్రదర్శన తరువాత బాబర్ ఆజామ్‌ను పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించి షాహిన్ షా అఫ్రిదీకి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది పీసీబీ. గతేడాది జనవరి లో అఫ్రిదీ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటకు వెళ్లిన పాక్‌కు గట్టి షాక్ తగిలింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్ 4-1 తేడాతో ఓడిపోయింది. దీంతో వెంటనే షాహిన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. షాహిన్ టీ20 కెప్టెన్సీ ముచ్చట అలా కేవలం ఒక్క సిరీస్‌కే పరిమితమైంది. మరి ఇప్పుడు వన్డే కెప్టెన్సీ ఎన్నాళ్లు ఉంటుందో.