Babar Azam : 100 లేకుండా 1000 పూర్తి చేసుకున్న బాబర్ ఆజామ్..
టెస్టుల్లో సెంచరీ చేయడం కోసం బాబర్ ఆజామ్ (Babar Azam) నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది.

Babar Azams wait for a Test century continues since 1030 days
Babar Azam : పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ టెస్టుల్లో తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 23, 42 పరుగులు చేసిన బాబర్ రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ విఫలం అయ్యాడు. కేవలం 16 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో బాబర్ శతకం చేసి 1000 రోజులకు పైనే అయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నువ్వు రిటైర్‌మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ సొంత అభిమానుల నుంచే బాబర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బాబర్ చివరి సారిగా 2022లో టెస్టుల్లో సెంచరీ చేశాడు. కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులు సాధించాడు. ఆ తరువాత నుంచి 28 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి కూడా అతడు ఒక్క మ్యాచ్‌లోనూ మూడు అంకెల స్కోరు అందుకోలేకపోయాడు.
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఇలా..
గత 28 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో బాబర్ 651 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సార్లు అర్ధశతకాలను సాధించినా వాటిని శతకాలుగా మలచలేకపోయాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బాబర్ సెంచరీ చేయక 1030 రోజులు అవుతోంది. కనీసం రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనైనా అతడు శతకాల కరువును తీర్చుకుంటాడో లేదో చూడాల్సిందే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మసూద్ (87), షకీల్ (66), షఫిక్ (57) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ కేశమ్ మహరాజా 7 వికెట్లు పడగొట్టాడు. సైమన్ హార్మర్ రెండు వికెట్లు తీయగా.. రబాడా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (8),టోనీ డి జోర్జీ (2) క్రీజులో ఉన్నారు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు దక్షిణాఫ్రికా ఇంకా 275 పరుగులు వెనుకబడి ఉంది.