Rishabh Pant : కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌.. ద‌క్షిణాఫ్రికాతో-ఏతో టెస్టు సిరీస్‌కు భార‌త-ఏ జ‌ట్టు ఎంపిక‌

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీకి ముహూర్తం ఖ‌రారైంది.

Rishabh Pant : కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌.. ద‌క్షిణాఫ్రికాతో-ఏతో టెస్టు సిరీస్‌కు భార‌త-ఏ జ‌ట్టు ఎంపిక‌

India A Squad For Four-Day Matches Against South Africa A Announced

Updated On : October 21, 2025 / 1:09 PM IST

Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం ఖ‌రారైంది. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడుతూ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న పంత్ న‌వంబర్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టెస్టు సిరీస్ పై దృష్టి సారించాడు. ఈ క్ర‌మంలో అత‌డిని ద‌క్షిణాఫ్రికా-ఏతో జ‌రిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల రెడ్ బాల్ సిరీస్ కోసం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశాడు. పంత్ సార‌థ్యంలోనే భార‌త్‌-ఏ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా-ఏతో త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త్‌-ఏ, ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్లు మ‌ధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ అక్టోబ‌ర్ 2 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు, రెండో మ్యాచ్ న‌వంబ‌ర్ 6 నుంచి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌కు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలోని మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

IND vs AUS : ఇదేం కెప్టెన్సీ.. శుభ్‌మ‌న్ గిల్ పై కైఫ్ విమ‌ర్శ‌లు..

భార‌త సీనియ‌ర్ టెస్టు జ‌ట్టులో స్థానం సంపాదించుకోవాల‌నుకునే యువ ఆట‌గాళ్ల‌కు ఈ సిరీస్ ఎంతో కీల‌కం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ సిరీస్‌లో రాణిస్తే.. ద‌క్షిణాఫ్రికా సీనియ‌ర్ జ‌ట్టుతో త‌ల‌ప‌డే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌చ్చు.

ఇక రెండో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్‌లు జ‌ట్టులో చేరుతారు.

మొదటి నాలుగు రోజుల మ్యాచ్ కు భార‌త్‌-ఏ జట్టు ఇదే..

రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ మ్హత్రే, ఎన్‌ జగదీసన్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరన్ష్ జాయిన్.

Rohit sharma : ఆస్ట్రేలియాతో రెండో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ 2 ప‌రుగులు చేస్తే.. చ‌రిత్ర..

రెండవ నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఇండియా A జట్టు..

రిషబ్ పంత్ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ దే బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్