×
Ad

Rishabh Pant : దేవుడు దయగలవాడు.. రిష‌బ్ పంత్ కామెంట్స్ వైర‌ల్‌..

శుక్ర‌వారం ద‌క్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ సంద‌ర్భంగా పంత్ (Rishabh Pant) మాట్లాడాడు.

Rishabh Pant Blockbuster Remark On Return After Injury

Rishabh Pant : శుక్ర‌వారం కోల్‌క‌తా వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. దాదాపు నాలుగు నెల‌ల విరామం త‌రువాత టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఈ మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. జూలైలో మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ షాట్ ఆడుతూ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

అత‌డి పాదానికి గాయం కావ‌డంతో అత‌డు ఆట‌కు దూరం అయ్యాడు. కోలుకుని ఫిట్‌నెస్ సాధించి ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా-ఏతో జ‌రిగిన అన‌ధికారిక టెస్టు సిరీస్‌లో భార‌త్‌-ఏ త‌రుపున బ‌రిలోకి దిగాడు. ఇక శుక్ర‌వారం ద‌క్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ సంద‌ర్భంగా పంత్ మాట్లాడాడు. గాయం త‌రువాత తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌డం అంత సుల‌భం కాద‌న్నాడు.

PAK vs SL : ఏం జ‌రిగినా స‌రే పాక్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిందే.. ప్లేయ‌ర్ల‌కు లంక బోర్డు అల్టిమేటం..! లేదంటే..

అయితే.. దేవుడు చాలా ద‌య‌గ‌ల‌వాడ‌ని తెలిపాడు. ఆయ‌న త‌న‌ను ఎల్ల‌ప్పుడూ ఆశీర్వ‌దించాడ‌న్నాడు. ఈ సారి కూడా ఆయ‌న త‌న‌ను క‌రుణించాడ‌ని చెప్పుకొచ్చాడు. మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. తాను గాయం నుంచి కోలుకునే స‌మ‌యంలో త‌న తల్లిదండ్రులు, కుటుంబం, అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని.. వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

తాను త‌న నియంత్ర‌ణ‌లో ఉన్న విష‌యాల‌పైనే దృష్టి సారిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక అదృష్టం అనేది ఎవ‌రి చేతుల్లో ఉండ‌ద‌ని, కాబ‌ట్టి దాని గురించి ఆలోచించ‌న‌ని అన్నాడు. మ‌న‌సుకు న‌చ్చే ప‌నుల‌నే చేస్తూ ఉండాల‌ని, ఇక ఏ ప‌ని చేసినా కూడా ఆస్వాదిస్తూ ఉంటాన‌న్నాడు. వంద‌శాతం కృషితో ప‌ని చేస్తే త‌ప్ప‌క విజ‌య‌వంతం అవుతుంద‌న్నాడు.

Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వ‌స్తా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ర‌వీంద్ర జ‌డేజా కండీష‌న్‌..!