Rishabh Pant : వారెవ్వా పంత్.. ఇలాంటి సిక్స్ చూసి ఎన్నాళ్ల‌య్యిందో.. వీడియో వైర‌ల్‌

మొద‌టి రెండు మ్యాచుల్లో 18, 28 పరుగులు చేసిన పంత్‌.. విశాఖలో విశ్వ‌రూపం చూపించాడు.

Rishabh Pant iconic one handed six

Rishabh Pant one handed six : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి విజ‌యాన్ని అందుకుంది. విశాఖ వేదిక‌గా చెన్నై సూపర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విజ‌యంలో ఆ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్‌పంత్ (51; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స‌ర్లు) కీల‌క పాత్ర పోషించాడు. పంత్ త‌నదైన శైలిలో దూకుడుగా ఆడ‌టాన్ని చూసి.. అటు ఢిల్లీ జ‌ట్టు అభిమానుల‌ పాటు ఇటు టీమ్ఇండియా ఫ్యాన్స్ సైతం ఆనంద ప‌డిపోతున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో పంత్ ఒంటి చేత్తో కొట్టిన సిక్స్ పాత పంత్‌ను గుర్తుకు తెచ్చింది.

2022 డిసెంబ‌ర్‌లో రిష‌బ్ పంత్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో అత‌డు త్రుటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. తీవ్ర‌గాయాలు కావ‌డంతో శస్త్రచికిత్సలు జరిగాయి. మ‌ళ్లీ పంత్‌ను మైదానంలో చూడ‌గ‌ల‌మా అన్న ప్ర‌శ్న‌లు వినిపించాయి. అయితే.. సంక‌ల్ప బ‌లంతో పంత్ మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌తోనే పున‌రాగ‌మ‌నం చేశాడు.

IPL 2024 : రావడం ఆలస్యమైనా రచ్చచేయడం మాత్రం కామన్.. విశాఖలో ధోనీ బౌండరీల మోత.. వీడియో చూడండి

మొద‌టి రెండు మ్యాచుల్లో 18, 28 పరుగులు చేసిన పంత్‌.. విశాఖలో విశ్వ‌రూపం చూపించాడు. చెన్నైతో మ్యాచ్‌లో పాత పంత్‌ను గుర్తుకు తెచ్చాడు. ఒంటిచేత్తో సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా.. ఈ సిక్స్‌పై మ్యాచ్ అనంత‌రం పంత్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు తాను కాస్త స‌మ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు.

చాలా కాలం త‌రువాత క్రికెట్ ఆడుతుండ‌డంతో ఇలాంటి ఓ ఇన్నింగ్స్ ఆడాల‌ని భావించినట్లు తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ కోసం దాదాపు ఏడాదిన్న‌ర‌పాటు ఎదురుచూసిన‌ట్లు చెప్పాడు. ఇక‌ ఒంటి చేత్తో సిక్స్ కొట్ట‌డం పై స్పందించ‌డానికి ఏమీ లేద‌న్నాడు. తాను ఓ క్రికెట‌ర్‌గా ఇప్ప‌టికి నేర్చుకుంటూనే ఉన్న‌ట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు