Rishabh Pant : గెలుపు జోష్‌లో ఉన్న పంత్‌కు భారీ షాక్‌.. మ‌రోసారి ఇలాగే జ‌రిగితే..!

గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ జ‌ట్టుకు ఐపీఎల్ నిర్వాహ‌కులు గ‌ట్టి షాక్ ఇచ్చారు.

Rishabh Pant Fined

Rishabh Pant Fined : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. విశాఖ వేదిక‌గా ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ జ‌ట్టుకు ఐపీఎల్ నిర్వాహ‌కులు గ‌ట్టి షాక్ ఇచ్చారు. జ‌ట్టు కెప్టెన్ అయిన రిష‌బ్ పంత్‌కు రూ.12ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు (నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటా పూర్తి చేయ‌నందుకు) జ‌రిమానా విధించారు.

ఈ మేర‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ సీజ‌న్‌లో ఇదే మొద‌టి త‌ప్పిదం కావ‌డంతో రూ.12 ల‌క్ష‌లు ఫైన్ వేసిట్లు తెలిపారు. ఇదే గనుక మరోసారి పునరావృతమైతే కెప్టెన్‌ రూ. 24 లక్షలు ఫైన్‌ వేస్తారు. అదే స‌మ‌యంలో జ‌ట్టులోని మిగిలిన ఆట‌గాళ్ల‌కు మ్యాచ్ ఫీజులో ఆరు ల‌క్ష‌ల మేర జ‌రిమానా ప‌డ‌నుంది.

BAN vs SL 2nd Test : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక‌.. 48 ఏళ్ల భార‌త రికార్డు బ్రేక్‌..

ఈ సీజ‌న్‌లో స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా జ‌రిమానా ఎదుర్కొన్న రెండో కెప్టెన్‌గా పంత్ నిలిచాడు. అంత‌క‌ముందు గుజ‌రాత్ టైటాన్స్‌తో కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్ కు ఫైన్ ప‌డింది. అది కూడా చెన్నైతో ఆడిన మ్యాచ్‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రిషబ్ పంత్‌ (51; 32 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో ప‌తిర‌ణ మూడు వికెట్లు తీశాడు. ర‌వీంద్ర జ‌డేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ల‌క్ష్య ఛేద‌న‌లో అజింక్య రహానె (45; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (37; 16 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు) ధాటిగా ఆడిన‌ప్ప‌టికీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో చెన్నై ఆరు వికెట్లు కోల్పోయి 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు, అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ తీశాడు.

MS Dhoni : మ‌నం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవ‌ర‌న్నా గుర్తు చేయండ‌బ్బా..! సాక్షి పోస్ట్ వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు