BAN vs SL 2nd Test : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక‌.. 48 ఏళ్ల భార‌త రికార్డు బ్రేక్‌..

టెస్టు క్రికెట్‌లో చాన్నాళ్లుగా టీమ్ఇండియా పేరిట ప‌దిలంగా ఉన్న ఓ రికార్డును శ్రీలంక జ‌ట్టు బ్రేక్ చేసింది.

BAN vs SL 2nd Test : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక‌.. 48 ఏళ్ల భార‌త రికార్డు బ్రేక్‌..

SriLanka

రికార్డులు అన్నాక బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం. అవి ఆట‌ల్లోనైనా, సినిమాల్లోనైనా స‌రే. టెస్టు క్రికెట్‌లో చాన్నాళ్లుగా టీమ్ఇండియా పేరిట ప‌దిలంగా ఉన్న ఓ రికార్డును శ్రీలంక జ‌ట్టు బ్రేక్ చేసింది. బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లంక జ‌ట్టు రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త‌ను అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో లంక జ‌ట్టు 531 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇందులో ఏముంది అని అంటారా..? ఒక్క బ్యాట‌ర్ కూడా సెంచ‌రీ చేయ‌కుండానే లంక భారీ స్కోరు చేసింది.

ఇలా ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క‌ సెంచరీ లేకుండా అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా శ్రీలంక జ‌ట్టు చరిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు భార‌త జ‌ట్టు పేరిట ఉండేది. 48 ఏళ్ల క్రితం అంటే 1976లో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ జ‌ట్టు పై 524/9 (డిక్లేర్డ్‌) ఇలాంటి ఫీట్‌ను సాధించింది. తాజాగా ఈ స్కోరును లంక దాటింది. ఇక్క‌డ విశేషం ఏమిటంటే..? అప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆరుగురు భార‌త ఆట‌గాళ్లు హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా, తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆరుగురు కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92), కరుణరత్నె (86), ధనంజయ డిసిల్వా (70), చండిమాల్ (59), నిషాన్ మదుష్క (57) లంక బ్యాట‌ర్లు అర్ధశతకాలు సాధించారు.

Shahid Afridi : ఒక్క సిరీస్‌కే అల్లుడి కెప్టెన్సీ పోయింది.. మామ‌ రియాక్ష‌న్ వైర‌ల్‌

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప‌టిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 531 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్‌ అల్‌ హసన్ మూడు వికెట్లు తీశాడు. హసన్‌ మెహమూద్ రెండు వికెట్లు సాధించ‌గా ఖలీద్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మీరజ్ తలా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

మూడో రోజు లంచ్ విరామానికి బంగ్లాదేశ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (6), మోమినుల్ హక్ (2) లు క్రీజులో ఉన్నారు. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 416 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. మొద‌టి టెస్ట్‌ మ్యాచ్‌ను శ్రీలంక గెలిచిన సంగ‌తి తెలిసిందే.

MS Dhoni : మ‌నం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవ‌ర‌న్నా గుర్తు చేయండ‌బ్బా..! సాక్షి పోస్ట్ వైర‌ల్‌