Rishabh Pant : దాన్ని చూస్తే ఇప్పుడే పంత్ కారు డ్రైవింగ్ చేసుకుంటూ పారిపోతాడు.. అభిమాని కామెంట్ పై రిష‌బ్ రియాక్ష‌న్ ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజ‌న్ ద్వారా టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ ద్వారా టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2022 డిసెంబ‌ర్ 30న పంత్ ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డు 14 నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉన్నాడు. అత‌డు కోలుకుని, ఫిట్‌నెస్ సాధించాడ‌ని, వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్‌గా అత‌డు ఐపీఎల్‌లో ఆడ‌నున్న‌ట్లు బీసీసీఐ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. దీంతో పంత్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

David Miller : పెళ్లి కంటే పైస‌లే ఎక్కువ‌..! మూడు మ్యాచులు.. రూ.1.25 కోట్లు..

ఐపీఎల్‌లో పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. కెప్టెన్‌గా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ త‌మ కెప్టెన్‌కు స్వాగ‌తం చెబుతూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసింది. ‘రిష‌బ్ పంత్‌కు స్వాగ‌తం. గర్జనకు సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని మైదానంలో చూసేందుకు ఇక‌ ఆగ‌లేక‌పోతున్నాం.’ అని డీసీ రాసుకొచ్చింది. డీసీ షేర్ చేసిన పోస్ట్‌లో టైగ‌ర్ రిట‌ర్న్స్ అని రాసి ఉండ‌డంతో పాటు టైగ‌ర్ క‌ళ్లు క‌నిపిస్తుండ‌గా పంత్ బ్యాట్ ప‌ట్టుకుని నిలుచున్నాడు.

అయితే.. ఓ అభిమాని ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ అడ్మిన్ యొక్క ఎడిటింగ్ నైపుణ్యం ప‌ట్ల సంతోషంగా లేడు. పంత్ రీ ఎంట్రీకి మంచి గ్రాఫిక్‌ను త‌యారు చేస్తాన‌ని చెప్పాడు. దాని చూసిన వెంట‌నే పంత్ త‌న కారు ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ పారిపోతాడు అని చెప్పాడు. స‌ద‌రు కామెంట్‌ను చూసిన పంత్ దీనికి రిప్లై ఇచ్చాడు. న‌వ్వుతున్న ఎమోజీల‌ను పోస్ట్ చేశాడు.

Sarfaraz Khan : సునీల్ గ‌వాస్క‌ర్‌ను క్ష‌మించ‌మ‌ని చెప్పండి.. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ను

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న మొద‌టి మ్యాచ్‌ను మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు