Sarfaraz Khan : సునీల్ గ‌వాస్క‌ర్‌ను క్ష‌మించ‌మ‌ని చెప్పండి.. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ను

సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేశాడు.

Sarfaraz Khan : సునీల్ గ‌వాస్క‌ర్‌ను క్ష‌మించ‌మ‌ని చెప్పండి.. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ను

Sunil Gavaskar - Sarfaraz Khan

Sarfaraz Khan – Sunil Gavaskar : సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేశాడు. వ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతుల ఒడిసి ప‌ట్టుకున్నాడు. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ‌శ‌త‌కాలు బాదాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.

అయితే.. ధ‌ర్మ‌శాల‌లో రెండో రోజు టీ విరామం త‌రువాత ఆడిన మొద‌టి బంతికే ఔట్ అయ్యాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 ప‌రుగులు చేశాడు. క్రీజులో నిల‌దొక్కుకున్న అత‌డు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు అనుకుంటున్న సమ‌యంలో టీ విరామం త‌రువాత తొలి ఓవ‌ర్‌లోని మొద‌టి బంతికే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో బంతిని త‌ప్పుగా అంచ‌నా వేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు.

నెం.1 స్థానంలోకి దూసుకెళ్లిన అశ్విన్.. టాప్ 10లో ముగ్గురు భారత్ బౌలర్లు

స‌ర్ఫ‌రాజ్ ఔట్ అయిన త‌రువాత భార‌త్ వేగంగా వికెట్లు కోల్పోయింది. కాగా.. స‌ర్ఫ‌రాజ్ ఔట్ పై టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్‌ గ‌వాస్క‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ‘బాల్ పిచ్ అప్ చేయ‌బ‌డింది. అది షాట్‌కు స‌రిపోదు. దాని కోసం వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. నా ఉద్దేశ్యం మీరు టీ త‌రువాత మొద‌టి బంతిని ఆడుకున్నారు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. దిగ్గ‌జ ఆట‌గాడు డాన్ బ్రాడ్‌మాన్ నాతో ఓ మాట చెప్పేవాడు. తాను 200 ప‌రుగుల స్కోరు వ‌ద్ద ఉన్నా కూడా తాను ఎదుర్కొనే త‌రువాతి బంతికి సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడిన‌ని చెప్పేవారు. స‌ర్ఫరాజ్ టీ త‌రువాత మొద‌టి బంతికే చెత్త షాట్ ఆడాడు.’ అని జియో సినిమాలో కామెంట్రీ చేస్తూ గ‌వాస్క‌ర్ అన్నాడు.

కాగా.. స‌ర్ఫ‌రాజ్ ఔట్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఎందుకు అంత తీవ్రంగా స్పందించాడు అనే విష‌యాన్ని దుబాయ్‌కు చెందిన వ్యాపార‌వేత్త శ్యామ్ భాటియా ది నేష‌న‌ల్ న్యూస్‌కి చెప్పారు. ఆ మ్యాచ్‌లో తొలి రోజు సాయంత్రం సునీల్ గ‌వాస్క‌ర్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ చాలా సేపు మాట్లాడుకున్నారు. గ‌వాస్క‌ర్ అత‌డికి ఎన్నో విలువైన స‌ల‌హాల‌ను ఇచ్చాడు. షాట్‌ల ఎంపిక గురించి అత‌డికి ప్ర‌త్యేకంగా చెప్పాడు. అయితే.. టీ త‌రువాత అత‌డు చెత్త షాట్‌కి ఔట్ అయ్యాడు. దీంతో సునీల్ కు చాలా కోపం వ‌చ్చింది. అందుక‌నే అత‌డు కామెంట్రీలో అలా చెప్పాడు. ఆ త‌రువాత రోజు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ నా వ‌ద్ద‌కు వ‌చ్చి ద‌య‌చేసి సునీల్ గ‌వాస్క‌ర్‌ను న‌న్ను క్ష‌మించ‌మ‌ని చెప్పండి. మ‌రోసారి అలాంటి త‌ప్పు చేయ‌ను అని చెప్పాడ‌ని శ్యామ్ భాటియా తెలిపాడు.

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ కోసం యువకులు ఏం చేశారో తెలుసా?.. వీడియో వైరల్