David Miller : పెళ్లి కంటే పైసలే ఎక్కువ..! మూడు మ్యాచులు.. రూ.1.25 కోట్లు..
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంటారు.

David Miller Postponed Wedding To Play Bangladesh Premier League
David Miller Postponed Wedding : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంటారు. దీన్ని కొందరు క్రికెటర్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దేశం తరుపున ఆడుతూనే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. కాగా.. ఓ క్రికెటర్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొద్ది రోజుల్లో తన పెళ్లి ఉంది అనగా మూడు మ్యాచ్‌లు ఆడితే రూ.1.25 కోట్లు ఇస్తామని ఓ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది మనోడు ఎంచక్కా పెళ్లిని వాయిదా వేసుకుని మరీ ఆ మూడు మ్యాచ్‌లు ఆడి ఆ పెద్ద మొత్తాన్ని తన జేబులో వేసుకున్నాడు. ఇంతకీ సదరు క్రికెటర్ ఎవరనీ అంటారా? అతడు మరెవరో కాదు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్.
డేవిడ్ మిల్లర్ గురించి భారత క్రికెట్ ప్రేమికులకు చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో అతడు గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. ఇటీవల అతడికి ఓ బంఫర్ ఆఫర్ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) కు చెందిన ఫార్చూన్ బరిషల్.. మిల్లర్ మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లిస్తామని చెప్పింది. వెంటనే మిల్లర్ ఇందుకు అంగీకరించాడు.
Sarfaraz Khan : సునీల్ గవాస్కర్‌ను క్షమించమని చెప్పండి.. మళ్లీ ఆ తప్పు చేయను
తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫిబ్రవరి 26న ఎలిమినేటర్, ఫిబ్రవరి 28న క్వాలిఫయర్ 2, మార్చి 1న ఫైనల్ మ్యాచుల్లో ఫార్చూన్ బరిషల్ తరుపున ఆడాడు. బీపీఎల్ 2024 విజేతగా ఆ జట్టే నిలవడం గమనార్హం. ఈ విషయాన్ని పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ తెలిపాడు.
‘నేను పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నాను. దీంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేకపోయాను. అయినప్పటికీ ఈ ఏడాది ఎవరు విజేతగా నిలిచారు అన్న సంగతి తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఓ విషయం తెలిసింది. మూడు మ్యాచులు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఆఫర్ ఇచ్చింది. దీంతో అతడు వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు.’ అని వసీం చెప్పాడు.
వాస్తవానికి ఫిబ్రవరిలో డేవిడ్ మిల్లర్ వివాహం జరగాల్సి ఉంది. అయితే.. దాన్ని వాయిదా వేసుకున్న మిల్లర్ బీపీఎల్ ముగిసిన తరువాత తన గర్ల్‌ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను మార్చి 10న మనువాడాడు.
కాగా.. అక్రం చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు ఉండాలే గానీ ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు, అయ్యో మాకు ఇలాంటి ఆఫర్ వస్తే బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
PSL 2024 : మరీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమన్నాయ్ చెప్పు.. ఫలితం అనుభవించావుగా