ROHIT and KOHLI IN BATTING PRACTICE IN PERTH
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 19న) పెర్త్ వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత జట్టు పెర్త్ కు చేరుకుంది. గురువారం ఆసీస్ గడ్డపై తొలి ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తరువాత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈక్రమంలో వీరిద్దరిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా కోహ్లీ, రోహిత్‌లు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌తో సిరీస్‌లో రాణించడం పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీలు నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు.
ROHIT & KOHLI IN BATTING PRACTICE…!!!! 💥
– The GOAT Duo is back. [Rohit Juglan from RevSportz] pic.twitter.com/h2T7CwRxXg
— Johns. (@CricCrazyJohns) October 16, 2025
బ్యాటింగ్ పిచ్..
పెర్త్‌లో తొలి వన్డేకు ఉపయోగించే పిచ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. పిచ్ పై గడ్డి తక్కువగా ఉంది. అంటే ఇది బ్యాటింగ్ స్వర్గధామంగా ఉంటే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన తొలి వన్డేలో పరుగుల వరద పారొచ్చు.
PITCH FOR INDIA vs AUSTRALIA FIRST ODI…!!! [📸: Rohit Juglan from RevSportz] pic.twitter.com/gLGUC7ruoC
— Johns. (@CricCrazyJohns) October 16, 2025