Virat Kohli : కోహ్లీ భవిష్యత్తుపై దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. లండన్‌లో వారానికి రెండు సార్లు..
విరాట్ కోహ్లీ (Virat Kohli ) వన్డే భవిష్యత్తు పై దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Dinesh Karthik provides update on Virat Kohli future
Virat Kohli : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ సిరీస్‌లో ఆడుతుండడమే అందుకు కారణం. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా చివరి సారిగా వీరిద్దరు మైదానంలో కనిపించారు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో రాణించకుంటే వీరికి ఇదే చివరి సిరీస్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడడం పైనే కోహ్లీ దృష్టి సారించాడని తెలిపాడు.
‘వాస్తవానికి కోహ్లీ ప్రపంచకప్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు లండన్‌లో ఉంటున్నాడు. మ్యాచ్‌లు లేని సమయంలో అతడు వారానికి రెండు నుంచి మూడు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు.’ అని కార్తీక్ తెలిపాడు. దీని బట్టే అతడు ప్రపంచకప్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతుందన్నాడు.
Dinesh Karthik said, “Virat Kohli is keen to play the 2027 World Cup, he is practicing 2-3 sessions a week in London”.
pic.twitter.com/6TgdJ3lQSH— Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2025
ఇక తన అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ టీమ్‌లో ఉంటే టెన్షన్ ఉండదన్నాడు. ఎందుకంటే ఒత్తిడిలో ఎలా ఆడాలనే విషయం అతడికి బాగా తెలుసన్నాడు. ఎన్నోసార్లు అలాంటి పరిస్థితుల్లో రాణించాడని, వన్డే ప్రపంచకప్ 2027లోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం హిట్‌మ్యాన్ చాలా ప్రెష్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నాడని తెలిపాడు. 2023లో తృటిలో వన్డే ప్రపంచకప్ ను భారత్ కోల్పోయింది. అప్పటి నుంచి ప్రపంచకప్ గెలిచే జట్టుకు కెప్టెన్ కావాలి అనేది అతడి కల అని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో అది తీరిపోయిందన్నాడు. అయినప్పటికి కూడా అతడిలో ఇంకా ఫైర్ ఉందన్నాడు. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ గెలవాలని హిట్‌మ్యాన్ కోరుకుంటున్నట్లుగా డీకే తెలిపాడు.