Rohit denied meeting with chief selector Agarkar and coach Dravid for T20 World Cup
Rohit Sharma – Ajit Agarkar : వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్‌లో సీనియర్లు, జూనియర్లు సత్తా చాటుతుండడంతో స్క్వాడ్‌లో ఎవరెవరు ఉంటారు? ఎవరిని పక్కన పెడతారు ? అనే దానిపై ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్‌లు సమావేశం అయ్యారని తుది జట్టును ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ వార్తల పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. అవన్నీ రూమర్లు అని కొట్టిపారేశాడు. తాను అజిత్ అగార్కర్‌ను కలవలేదన్నాడు. ప్రస్తుతం అగార్కర్ దుబాయ్‌లో ఉన్నాడని చెప్పారు. ద్రవిడ్ బెంగళూరులో తన కుటుంబంతో కలిసి ఉన్నాడని తెలిపారు. సెలక్టర్‌ను, కోచ్‌ను కలవకుండా జట్టును ఎలా ఖరారు చేస్తామని ప్రశ్నించాడు. జట్టు గురించి ఏదైన ముఖ్య సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఒకరు చెబుతారన్నాడు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ అవాస్తవాలేనని చెప్పాడు.
Aaron Finch : ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. అదొక్కటే మార్గం : ఫించ్
ధోనిని ఒప్పించడం కష్టం..
టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా మహేంద్ర సింగ్ ధోనిని ఒప్పించడం కష్టమని రోహిత్ శర్మ చెప్పాడు. ఐపీఎల్ ఆడడం వల్ల ధోని అలసిపోతున్నాడని, మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. వెస్టిండీస్ రాకపోవచ్చు గానీ అమెరికాకు వచ్చే అవకాశం ఉందన్నాడు. అక్కడ గోల్ఫ్ ఆడేందుకు వస్తాడని అనుకుంటున్నటు చెప్పాడు. ఐపీఎల్‌లో ముంబై పై నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు.. అవే మా ఓటమిని ఖాయం చేశాయని రోహిత్ అన్నాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో టీమ్ఇండియా మెంటార్‌గా ధోని సేవలందించాడు. ఈ క్రమంలోనే ఈ సారి ప్రపంచకప్‌కు అతడు మెంటార్‌గా ఉంటే బాగుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ పై విధంగా స్పందించాడు.
CSK : సీజన్ మధ్యలో చెన్నైకు భారీ ఎదురుదెబ్బ.. విజయావకాశాలపై ప్రభావం..!