Rohit records his 11th duck in international cricket while leading the Indian team
IND vs NZ : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరసన చేరాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఎవ్వరూ కోరుకోని ఈ చెత్త రికార్డును రోహిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. టీమ్ఇండియా కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు ఇది 11వ డకౌట్ కావడం గమనార్హం. ఇక ధోని కూడా టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన సమయంలో 11 సార్లు డకౌట్ అయ్యాడు.
భారత కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 250 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు డకౌట్ అయ్యాడు. ఆ తరువాత సౌరవ్ గంగూలీ 13 సార్లు ఉన్నాడు. వీరిద్దరి తరువాత రోహిత్, ధోని చెరో 11 సార్లు డకౌట్లు అయ్యారు.
IND vs NZ : ఇదేం షాట్ రా అయ్యా.. కోహ్లీ కెరీర్‌లోనే చెత్త షాట్.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ వైరల్
టీమ్ఇండియా కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – 250 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు డకౌట్
సౌరవ్ గంగూలీ – 217 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు
ఎంఎస్ ధోని – 330 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు
రోహిత్ శర్మ – 143 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు
కపిల్ దేవ్ – 115 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా (38), యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) లు ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. గ్లెన్ ఫిలిఫ్స్ రెండు వికెట్లు, టిమ్ సౌథీ ఓ వికెట్ సాధించాడు.
Shikhar Dhawan: అర్ధరాత్రి వేళ శిఖర్ ధావన్ చేసిన పనికి అంతా షాక్.. ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు
Rohit Sharma records his 11th duck in international cricket while leading the Indian team. pic.twitter.com/PyfLGgIan1
— CricTracker (@Cricketracker) October 24, 2024