India vs Bangladesh Match: బంగ్లాతో రెండో టెస్ట్‌కూ దూరమైన రోహిత్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఈ నెల 22 నుంచి 26 వరకు బంగ్లా దేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే రెండో టెస్టు లోనూ రోహిత్ శర్మ ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది.

Rohit sharma

India vs Bangladesh Match: బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా  ఇండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ క్రమంలో 1-0తో టెస్ట్ సిరీస్ లో భారత్ ముందుంది. ఈ నెల 22 నుంచి 26వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

బంగ్లాతో చివరి వన్డేలో స్లిప్‌లో క్యాచ్ పట్టే క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలికి గాయమైంది. ఆ తరువాత గ్రౌండ్ వదిలి వెళ్లిన రోహిత్ చివరిలో వచ్చి బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవటంతో పాటు సిరీస్ ను సైతం కోల్పోయింది. మొదటి టెస్టు మ్యాచ్ కు రోహిత్ దూరమయ్యాడు. కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వ్యవహరించారు. అయితే, రెండో టెస్టు కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని తొలుత బీసీసీఐ పేర్కొంది. కానీ, గాయం పూర్తిగా నయం కాకపోవటంతో రోహిత్ రెండో టెస్టు కు దూరమయ్యాడు. మరోవైపు ఉదర కండరాల ఒత్తిడి కారణంగా నవదీప్ సైనీ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.

టీమిండియా జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ ( వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శర్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజుద్దీన్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్ లు రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారు. అయితే, వీరిలో 11 మంది ప్లేయర్లు బంగ్లాతో మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగుతారు.