Rohit Sharma Family
Rohit Sharma New Born Son Name: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే గతనెల 15వ తేదీన రెండవ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రితికా సజ్దే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కుమారుడి పేరును వెల్లడించారు. అహాన్ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. రితికా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో భార్యాభర్త, ఇద్దరు పిల్లలు కలిగిన కుటుంబంకు సంబంధించిన బొమ్మను షేర్ చేశారు. బొమ్మలోని నలుగురు క్రిస్మస్ నేపథ్యంతో కూడిన డ్రస్ ను ధరించినట్లుగా ఉంది. ఒక్కో బొమ్మపై కుటుంబ సభ్యుల పేర్లతో రోహిత్, రితికా, సామీ (సమైరా), అహాన్ పేర్లను రాశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోహిత్ శర్మ, రితికా సజ్దే 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ 30న రితికా పాపకు జన్మించింది. పాపకు సమైరా అని పేరుపెట్టారు. గత నెల రితికా రెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాబుకు అహాన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్టు పెర్త్ లో జరగ్గా.. ఇండియా ఘన విజయం సాధించింది. అయితే, ఈ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరయ్యాడు. రితికా మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె వెంటే రోహిత్ ఉన్నాడు. గత నాలుగు రోజుల క్రితం రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ టీం సభ్యులతో చేరాడు. రెండో టెస్టు ఈనెల 6 నుంచి మొదలు కానుండగా.. రోహిత్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.
రోహిత్ సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియాలో పోస్టులో తమ కుమారుడి పేరు వెల్లడిస్తూ ఫొటో షేర్ చేయడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ అని కొందరు పేర్కొనగా.. న్యూ కెప్టెన్ శర్మ వచ్చేశాడని కొందరు సోషల్ మీడియాలో తమదైన రీతిలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ahaan sharma ❤️
Rohit sharma son name#RohitSharma𓃵 pic.twitter.com/Q5OVFW3C9u— Rohitbhaiya4598 (@Rohitbhaiya4598) December 1, 2024
Rohit Sharma son name -ahaan
Beautiful name 😍 #RohitSharma𓃵 #ahaan #AUSvsIND pic.twitter.com/o7k2ueJcNL
— virat kohli fan 🤞🏿 (@mr_xyz05) December 1, 2024
Guys it’s official…!!!!🥳❤️
Rohit Sharma and Ritika sajdeh named their son ‘Ahaan’.
The new captain sharma is here 🐐 pic.twitter.com/5k3svW06Vl
— Prathmesh. (@45Fan_Prathmesh) December 1, 2024
Ahaan Sharma son of Rohit Sharma 🦁🐯 pic.twitter.com/1Z702EDTWK
— Manojkumar (@Manojkumar_099) December 1, 2024
Welcome to your father’s kingdom, Prince Ahaan Sharma 😇
Scene be like outside the Rohit home after He reveals his son name 💪 #RohitSharma𓃵 #BGT2025 pic.twitter.com/0z4CjYpPKi
— CricketComiX (@CricketComiX) December 1, 2024