WTC: ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా

డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ..

WTC: ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా

Australia Team

Updated On : December 1, 2024 / 11:00 AM IST

ICC WTC Points Table 2025: ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగ్గా.. ఇండియా ఘన విజయం సాధించి సొంతగడ్డపై ఆసీస్ కు గట్టిషాకిచ్చింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ జట్టు రెండోస్థానంకు పడిపోయింది. ఇండియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా రెండో స్థానంలో ఉన్న ఆసీస్ ను సౌతాఫ్రికా జట్టు వెనక్కి నెట్టేసింది.

Also Read: ICC Champions Trophy 2025: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అతితెలివి.. వారి డిమాండ్లకు ఐసీసీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?

డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆస్ట్రేలియా జట్టును వెనక్కినెట్టి రెండో స్థానంకు చేరింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు తొమ్మిది మ్యాచ్ లలో ఐదు విజయాలు, మూడు ఓటములతో 59.26శాతంతో రెండో స్థానంలోకి వెళ్లింది. 61.11శాతంతో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా జట్టు 57.69శాతంతో మూడో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.

Also Read: NZ vs ENG : 150వ టెస్టులో జోరూట్ డ‌కౌట్‌.. ఆనందంలో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఫ్యాన్స్‌..

ఈనెల 6 నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా జట్టు ఓడిపోతే పాయింట్ల పట్టికలో తన స్థానం మరింత దిగజారే అవకాశం ఉంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కు సమయం దగ్గర పడుతుంది. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్యనే ఫైనల్ బెర్త్ లు ఖరారయ్యే అవకాశం ఉంది. తాజాగా న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇక శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పొచ్చు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మరో నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఏ జట్టు ఎక్కువ మ్యాచ్ లలో విజయం సాధిస్తే.. ఆ జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ ల్లో బెర్త్ ఖరారు కావటం ఖాయంగా కనిపిస్తుంది.