NZ vs ENG : 150వ టెస్టులో జోరూట్ డకౌట్.. ఆనందంలో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఫ్యాన్స్..
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ తన కెరీర్‌లో 150వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.

Root out for duck in 150th Test goes past Kohli on unwanted WTC list
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ తన కెరీర్‌లో 150వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మైలు స్టోన్ మ్యాచ్‌ను క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాది చిరస్మరణీయం చేసుకోవాలని రూట్ భావించాడు. అయితే.. ఎవ్వరూ కోరుకుని ఓ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో అత్యధిక సార్లు డకౌట్లు అయిన ప్యాబ్ -4 బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇంతకముందు వరకు ఈ రికార్డు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. డబ్ల్యూటీసీ చరిత్రలో వీరిద్దరు చెరో ఏడు సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. తాజా డకౌట్‌తో రూట్ వీరిని అధిగమించాడు. దీంతో కోహ్లీ, స్మిత్ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు.
IND vs AUS : అరెరె.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు..! కేఎల్ రాహుల్ పరిస్థితి ఏందయ్యా ?
150 మ్యాచులో డకౌట్..
టెస్టు క్రికెట్ చరిత్రలో 150వ మ్యాచులో డకౌట్ అయిన మూడో బ్యాటర్‌గా జోరూట్ రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌వా, రికీ పాంటింగ్‌లు ఉన్నారు. వీరిద్దరూ కూడా గోల్డెన్ డకౌట్ కావడం విశేషం.
150వ టెస్టు మ్యాచులో డకౌట్ అయిన ఆటగాళ్లు వీరే..
* స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 2002లో పాకిస్థాన్ పై మొదటి బంతికే
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 2010లో ఇంగ్లాండ్ పై తొలి బంతికే
* జో రూట్ (ఇంగ్లాండ్) – 2024లో న్యూజిలాండ్ పై నాలుగు బంతులకు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో బ్రిడన్ కార్స్, షోయబ్ బషీర్‌లు చెరో నాలుగు వికెట్లు సాధించారు. గుస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 74 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లో హ్యారీ బ్రూక్ (132 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. అతడికి తోడుగా కెప్టెన్ బెన్‌స్టోక్స్ (37) క్రీజులో ఉన్నారు. కివీస్ కంటే ఇంగ్లాండ్ మరో 29 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.