IND vs AUS : అరెరె.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు..! కేఎల్ రాహుల్ పరిస్థితి ఏందయ్యా ?
గాయం నుంచి గిల్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని తెలుస్తోంది.

IND vs AUS Shubman Gill returns to nets amid injury concerns
తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చేతికి గాయమైంది. దీంతో అతడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు దూరం అయ్యాడు. అతడు కోలుకునేందుకు 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని, ఈ క్రమంలో అతడు రెండో టెస్టుకు సైతం దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందుతోంది.
గాయం నుంచి గిల్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని తెలుస్తోంది. తాజాగా అతడు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత జట్టు శనివారం నుంచి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XIతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇది డే/నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనూ గిల్ ఆడనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. నెట్స్‌లో గిల్ అద్భుతంగా ఆడుతున్నాడని, బంతిని ఎదుర్కొనడంలో ఎలాంటి ఇబ్బంది పడడం లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
అతడితో పాటు వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరం అయిన కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రాక్టీస్‌లో కష్టపడుతున్నాడు. వీరిద్దరు రెండో టెస్టులో తుది జట్టులోకి రావడం ఖాయం. వీరిద్దరు గనుక తుది జట్టులోకి వస్తే.. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌ను పక్కన పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
ఇక రోహిత్ గైర్జాజరీలో తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఆడనుండడంతో కేఎల్ రాహుల్ ఏ స్థానంలో బరిలోకి దిగనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే ఛాన్స్ ఉంది.
Faf du plessis : బుడ్డొడా.. ఎంత పని చేశావురా.. డుప్లెసిస్‌ని ఎత్తిపడేసిన కుర్రాడు..
ఇదిలా ఉంటే.. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 6 నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇది డే/నైట్ మ్యాచ్.
GREAT NEWS FOR TEAM INDIA…!!!
– Shubman Gill is batting in nets ahead of the Day & Night Test. [📸: Rohit Juglan from RevSportz] pic.twitter.com/inKDdpFmat
— Johns. (@CricCrazyJohns) November 29, 2024