NZ vs ENG : నువ్వు మనిషివా.. పక్షివా.. నమ్మశక్యంగాని రీతిలో క్యాచ్ అందుకున్న ఫీల్డర్.. చూస్తే ఔరా అనాల్సిందే..
న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ సైతం నమ్మశక్యం కానీ రీతిలో ఓ క్యాచ్ అందుకున్నాడు.

NZ Fielder Glenn Phillips stunning flying catch against England in 1st test
క్రికెట్‌లో కొందరు ఫీల్డర్లు మెరుపు వినాస్యాలతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ సైతం నమ్మశక్యం కానీ రీతిలో ఓ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నువ్వు మనిషివా పక్షివా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 53వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను టిమ్ సౌథీ వేశాడు. ఓ బంతిని ఓలీపోప్ కట్ షాట్ ఆడాడు. అయితే.. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంతి చేత్తో నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు.
Cricketer Dies : విషాదం.. బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో మరణించిన బ్యాటర్
దీన్ని చూసిన బ్యాటర్ ఓలీపోప్‌కు దిమ్మదిరగగా.. ఫీల్డర్లు ఆశ్చర్యపోయారు. మైదానంలోని ప్రేక్షకులు మంత్రముగ్దులైపోయారు. గ్లెన్ అద్భుత క్యాచ్‌తో పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ (93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (132 నాటౌట్), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (37 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది.
Faf du plessis : బుడ్డొడా.. ఎంత పని చేశావురా.. డుప్లెసిస్‌ని ఎత్తిపడేసిన కుర్రాడు..
Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u
— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024