Faf du plessis : బుడ్డొడా.. ఎంత పని చేశావురా.. డుప్లెసిస్‌ని ఎత్తిపడేసిన కుర్రాడు..
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటుచేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం

Boy Lifts Faf du plessis in fielding during the Abu Dhabi T10
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటుచేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ ఘటననే దుబాయ్ వేదికగా జరుగుతున్న అబుదాబి టీ10 టోర్నీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన 40 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. కుర్రాళ్లతో పోటీ పడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. అంతేనా తనదైన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం డుప్లెసిస్ అబుదాబి 10 టోర్నీ ఆడుతున్నాడు. ఈటోర్నీలో అతడు మోరిస్విల్లే సాంప్ ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 5 మ్యాచుల్లో 191 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
SA vs SL : వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక.. 83 బంతుల్లోనే..
కాగా.. మంగళవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీ, ఢిల్లీ బుల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ కొట్టిన ఓ బంతిని ఆపేందుకు డుప్లెసిస్ తీవ్రంగా ప్రయత్నించాడు. బంతి బౌండరీ లైన్ దాటి వెళ్లిపోయింది. అక్కడే బాల్ బాయ్‌గా ఉన్న కుర్రాడు బంతిని అందుకునేందుకు కిందకు వంగాడు అదే సమయంలో ఆ బాలుడిని గమనించిన డుప్లెసిస్ తన పరుగును నియంత్రించుకోలేక ఆ బాలుడి పై నుంచి దూకేందుకు సిద్ధం అయ్యాడు. అదే సమయంలో ఆ బాలుడు పైకి లేవపోయాడు.. డుప్లెసిస్ గాల్లోనే ఉండగా.. బాలుడు తన చేతులతోనే ఎత్తి పడేశాడు. దీంతో డుప్లెసిస్.. అడ్వర్టైజింగ్ బోర్డు బయట పడ్డాడు.
అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది డుప్లెసిస్ లేపేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే పైకి లేచిన డుప్లెసిస్ నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Faf Du Plessis. 🥲 pic.twitter.com/BHJWL7pB2S
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 29, 2024