SS Rajamouli – David Warner : రాజమౌళితో ఒక్క యాడ్.. మారిపోయిన డేవిడ్ వార్నర్ జీవితం..! ఇక ఇంట్లోనే..
సెంటిమెంట్లను నమ్మడం, నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వారిది.

David warner goes unsold in ipl auction Is that Rajamouli curse
సెంటిమెంట్లను నమ్మడం, నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వారిది. అయితే.. కొన్ని సార్లు సెంటిమెంట్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలోనూ ఓ సెంటిమెంట్‌ను కొందరు బలంగా విశ్వసిస్తున్నారు. అదే రాజమౌళి సెంటిమెంట్. తన సినీ కెరీర్‌లో రాజమౌళి తీసిన చిత్రాలు అన్ని బ్లాక్ బస్టర్‌లే. అయితే.. జక్కన్న చిత్రాల్లో నటించిన తరువాత ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పరాజయాన్ని చవిచూస్తుంటాడు.
నితిన్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరికి ఈ అనుభవం ఎదురైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని అంటున్నారు ఇప్పుడు. క్రికెట్‌కు సైతం రాజమౌళి సెంటిమెంట్ పట్టుకుందని అంటున్నారు. ఇందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఊదాహారణగా చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్ అన్‌సోల్డ్‌గా మిగలడానికి జక్కన్నే కారణమని చెబుతున్నారు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ నేతృత్వంలో కాన్‌బెర్రాలో అడుగుపెట్టిన భారత్..
డేవిడ్ వార్నర్, రాజమౌళిలు కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఈ యాడ్‌లో వార్నర్‌తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తాడు. మొత్తంగా యాడ్ ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు యాడ్ మరోసారి వైరల్‌గా మారింది. రాజమౌళితో వార్నర్ పని చేయడం వల్లే వేలంలో అతడికి నిరాశఎదురైందని అంటున్నారు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన వార్నర్ పై వేలంలో కోట్ల వర్షం కురుస్తుందని చాలా మంది భావించారు. అయితే ఐపీఎల్ వేలం2025లో మొదటి సారి అతడి పేరు వచ్చినప్పుడు ఎవ్వరూ తీసుకోలేదు. దీంతో రెండో సారి అయినా.. కనీస ధర రూ.2 కోట్లకు అయినా అతడిని ఏదో ఫ్రాంఛైజీ తీసుకుంటుందని భావించారు. అలా కూడా జరగలేదు. 40 ఏళ్ల డుప్లెసిస్‌ను తీసుకున్నప్పటికి వార్నర్‌ను కొనేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు.
దీంతో రాజమౌళి శాపం వార్నర్‌కు తగిలిందని సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మైదానంలో వార్నర్‌ను చూడలేం అని, అతడు ఇంట్లో రీల్స్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం అలా ఏం కాదని.. వార్నర్ రిటైర్ అయ్యాడని, అతడి కంటే యువ ఆటగాళ్లను తీసుకుంటే బాగుంటుందని ఫ్రాంఛైజీలు భావించి ఉంటాయని అంటున్నారు.
ఏదీ ఏమైనప్పటికి డేవిడ్ వార్నర్‌ను మైదానంలో చూడలేకపోవడం సగటు క్రికెట్ అభిమానికి బాధను కలిగించే అంశమే.
Rajamouli curse for real pic.twitter.com/wLtNogK5jC
— Virat (@itz_manoj18) November 27, 2024