IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ నేతృత్వంలో కాన్‌బెర్రాలో అడుగుపెట్టిన భారత్..
ఈ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కాన్‌బెర్రాకు చేరుకుంది

Rohit Sharma and his Co land in Canberra for pink ball Test challenge
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భారత్ శుభారంభం చేసింది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఇదే ఉత్సాహంలో రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
పింక్ బాల్ టెస్టుకు సన్నద్ధం అయ్యే క్రమంలో భారత్ జట్టు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్XI జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 30, డిసెంబర్ 1న జరగనున్న ఈ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కాన్‌బెర్రాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.
ఈ వీడియో పెర్త్ నుంచి కాన్‌బెర్రాకు టీమ్‌ఇండియా ప్రయాణాన్ని చూపుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని బృందం పెర్త్ నుండి కాన్‌బెర్రాకు చేరుకుంది. ఆటగాళ్లు తమ ట్రావెల్ కిట్‌లతో కనిపించారు
ఇక భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు పింక్ బాల్ టెస్టుల్లో ఆడింది. ఇందులో మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. అది కూడా 2020లో ఆస్ట్రేలియాపైనే కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో భారత్ ఓ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్ ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Rahul Dravid – Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ కెరీర్ పై రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాలతో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి వచ్చేశాడు. ఈ క్రమంలో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత సహాయక సిబ్బంది కోచింగ్ బాధ్యతలను నిర్వహిస్తారు. సహాయ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఉన్నారు. రెండో టెస్టు ప్రారంభం నాటికి గౌతమ్ గంభీర్ జట్టుతో కలవనున్నాడు.
Perth ✅#TeamIndia have arrived in Canberra! 🛬#AUSvIND pic.twitter.com/IhNtPmIOah
— BCCI (@BCCI) November 28, 2024