IND vs AUS : తొలి టెస్టులో ఓటమి.. క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. అన్‌క్యాప్డ్ ఆటగాడికి పిలుపు.. భారత్‌కు చుక్కలేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది.

IND vs AUS Tasmanian all rounder Beau Webster added to Australia squad for second Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టాస్మానియన్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌ను రెండో టెస్టు కోసం జట్టులోకి తీసుకుంది.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయంతో బాధపడుతున్నాడు. రెండో టెస్టులో అతడు ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టాస్మానియన్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ ను బ్యాకప్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టు కోసం 14 మందితో కూడిన జట్టును ఆసీస్ బోర్డు ప్రకటించింది.
Rahul Dravid – Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ కెరీర్ పై రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..
రెండో టెస్టుకు ఎంపిక కావడం పట్ల బ్యూ వెబ్‌స్టర్ స్పందించాడు. తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా క్రికెట్ వర్గాలు చెబుతున్నారు.
30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ షెఫీల్డ్ షీల్డ్‌లో అదరగొడుతున్నాడు. ఓ సీజన్‌లో 900 కంటే ఎక్కువ పరుగులు, 30 వికెట్లు తీసిన రెండవ ఆటగాడిగా వెబ్‌స్టర్ నిలిచాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 54 మ్యాచులు ఆడాడు. 1317 పరుగులు చేశాడు. 44 వికెట్ల తీశాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 93 మ్యాచులు ఆడాడు. 5297 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ వికెట్ కీపర్ దూరం
రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్, బ్యూ వెబ్‌స్టర్
JUST IN: A fresh face confirmed for the Aussie Test squad heading to Adelaide! #AUSvIND
Details: https://t.co/436boXikq6 pic.twitter.com/pcXntNLsVH
— cricket.com.au (@cricketcomau) November 28, 2024