Rahul Dravid – Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ కెరీర్ పై రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు.

Rahul Dravid shocking take on Yashasvi Jaiswal career
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. పెర్త వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారీ సెంచరీ (297 బంతుల్లో 161 పరుగులు) చేసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ ఆటగాడిని మెచ్చుకున్నాడు. రోజు రోజుకి ఈ యువ ఆటగాడు మెరుగు అవుతున్నాడని చెప్పాడు.
వెస్టిండీస్ పై ఏడాదిన్నర క్రితం యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. అప్పుడు టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ పై అరంగ్రేటం చేసిన ఓ కుర్రాడు ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరుకున్నాడంటే ఊహించడం కూడా కష్టమేనని ద్రవిడ్ అన్నాడు. జైస్వాల్ ఆటను మొదలు పెట్టి ఎక్కువ కాలం కాలేదన్నాడు. తొలి సిరీస్‌లో అతడు కాస్త తికమకపడ్డాడని గుర్తు చేసుకున్నాడు. అయితే.. ఒక్కసారి కుదురుకున్నాక మాత్రం తన పరుగుల దాహాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పాడు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ వికెట్ కీపర్ దూరం
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయడం అరుదైన ఫీట్ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ఎంతో మంది క్రికెటర్లకు ఇది సాధ్యం కూడా కాదన్నాడు. పరుగుల దాహం ఉన్న జైస్వాల్ వంటి ఆటగాళ్లకు మాత్రం చాలా సులువు అని అన్నాడు. ఇక రోజు రోజుకు యశస్వి మరింత మెరుగు అవుతూనే ఉన్నాడని ద్రవిడ్ చెప్పాడు.
యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడాడు. 58.07 సగటుతో 1568 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. కాగా.. అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. డే అండ్ నైట్ జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించాలని భారత్ భావిస్తోంది.
Hardik Pandya : చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్‌ను ఉతికారేసిన హార్దిక్ పాండ్య.. 6, 6, 6, 6,4..