Cricketer Dies : విషాదం.. బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణించిన బ్యాట‌ర్‌

క్రికెట్ ఆడుతూ ఓ వ్య‌క్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

Cricketer Dies : విషాదం.. బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణించిన బ్యాట‌ర్‌

Cricketer Dies Of Cardiac Arrest In Stadium While Playing In Pune

Updated On : November 29, 2024 / 11:53 AM IST

ఇటీవ‌ల కాలంలో గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ వ్య‌క్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పూణెలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

గార్వేర్ స్టేడియంలో గురువారం ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో 35 ఏళ్ల ఇమ్రాన్ ప‌టేల్ అనే వ్య‌క్తి ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. కాసేపు బ్యాటింగ్ స‌జావుగానే చేశాడు. ఓ బౌండ‌రీ సైతం బాదాడు. అనంత‌రం త‌న చాతీలో నొప్పిగా ఉంది అంటూ స‌హ‌చ‌రుడికి చెప్పాడు. పిచ్‌పైనే కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు.

Faf du plessis : బుడ్డొడా.. ఎంత ప‌ని చేశావురా.. డుప్లెసిస్‌ని ఎత్తిపడేసిన కుర్రాడు..

డ‌గౌట్‌లోని వారికి హెల్మెట్ తేవాలంటూ సైగ‌ చేశాడు. ఛాతీతో పాటు చేయి ఎడ‌మ‌చేయిలో కూడా నొప్పిగా అనిపించ‌డంతో అంపైర్ల‌కు ఈ విష‌యాన్ని చెప్పాడు. అంపైర్ల‌తో పాటు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్‌కు త‌న ప‌రిస్థితి వివ‌రించాడు. మైదానాన్ని వీడేందుకు సిద్ధం అయ్యాడు. కొన్ని అడుగులు వేయ‌గానే మైదానంలోనే అత‌డు కుప్ప‌కూలిపోయాడు. దీంతో అంపైర్లు, ఫీల్డ‌ర్లు అత‌డి వ‌ద్ద‌కు ప‌రుగున‌ వెళ్లారు.

హుటాహుటిన ఇమ్రాన్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.

SA vs SL : వందేళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన శ్రీలంక‌.. 83 బంతుల్లోనే..

అయితే.. అత‌డికి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని తోటి క్రికెట‌ర్లు తెలిపారు. అత‌డు ఎంతో ఫిట్‌గా ఉన్నాడ‌ని అన్నారు. అత‌డికి భార్య‌, ముగ్గురు కూతుర్లు, ఓ కొడుకు ఉన్న‌ట్లుగా చెప్పారు. ఇమ్రాన్ క్రికెట్ ఆడ‌డంతో పాటు రియ‌ల్ ఎస్టేట్, జ్యూస్ షాప్ నిర్వ‌హిస్తూ ఉండేవాడ‌ని చెప్పారు.