ICC Champions Trophy 2025: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అతితెలివి.. వారి డిమాండ్లకు ఐసీసీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించినప్పటికీ ఐసీసీ ముందు రెండు డిమాండ్లు ఉంచింది..

ICC Champions Trophy 2025: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అతితెలివి.. వారి డిమాండ్లకు ఐసీసీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?

Champions Trophy 2025

Updated On : December 1, 2024 / 8:44 AM IST

ICC Champions Trophy 2025: పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పై ఉత్కంఠ కొనసాగుతోంది. హైబ్రిడ్ పద్దతిలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలుత ససేమీరా అంది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్నింగ్ తో ఎట్టకేలకు పీసీబీ దిగొచ్చింది. వాస్తవంగా ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి పాకిస్థాన్ ఆధిత్యమిస్తుంది. పాక్ లో పర్యటించటానికి భారత్ నిరాకరించింది. తటస్థ వేదికలపై మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమని భారత్ స్పష్టం చేసింది. అయితే, తొలుత పాకిస్థాన్ అందుకు నిరాకరించినప్పటికీ.. ఐసీసీ సూచనలతో దొగొచ్చింది. హైబ్రిడ్ పద్దతికి అంగీకరిస్తామని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీ ముందు రెండు ప్రతిపాదనలను పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఉంచారు. దీంతో పాక్ ప్రతిపాదనలపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు.. తొలి కివీస్ ఆటగాడు అతనే

పాక్ క్రికెట్ బోర్డు పేర్కొన్న ప్రకారం.. హైబ్రిడ్ పద్దతిలో ఛాంపియన్ ట్రోఫీ వన్డే టోర్నీ నిర్వహణకు అంగీకరిస్తాం. కానీ, భవిష్యత్తు లో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే ఆ మ్యాచ్ లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. ఎందుకంటే.. 2026లో టీ20 ప్రపంచ కప్, 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే ప్రపంచకప్ లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఒకవేళ మేము ఆ సమయంలో తటస్థ వేదికల్లో ఆడాలని అనుకుంటే మా నిర్ణయాన్ని గౌరవించాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. ఐసీసీకి భారత్ తన విధానాన్ని చెప్పింది కాబట్టి మేం కూడా మా విధానం చెబుతాం.. ఏం చేసినా ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా ఉండాలని ఆయన పేర్కొన్నాడు. అంతేకాక.. పీసీబీ ఓ అడుగు ముందుకేసి ఐసీసీ వార్షిక ఆదాయంలో తమ వాటాను పెంచాలని డిమాండ్ చేస్తోంది.

Also Read: AUS vs IND: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్

ఐసీసీ ప్రతీయేటా 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5073 కోట్లు) పంపిణీ చేస్తోంది. ఐసీసీఐ ఆదాయంలో బీసీసీఐ గరిష్ఠంగా 38.50శాతం (దాదాపు రూ.1953 కోట్లు) వాటా పొదుతుంది. ఇది పాకిస్థాన్ కంటే ఏడు రెట్లు ఎక్కువ. ఇండియా తరువాత ఇంగ్లండ్ 6.89శాతం, ఆస్ట్రేలియా 6.25శాతం, పాకిస్థాన్ జట్టు 5.75శాతం వాటాను పొందుతున్నాయి. 5.75శాతం అంటే ప్రతీయేటా దాదాపు రూ. 291 కోట్లు పాకిస్థాన్ షేర్ కు వస్తోంది. ప్రస్తుతం ఆ షేర్ శాతం పెంచాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. మొత్తానికి.. భారత్ లో జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ జట్టు హైబ్రిడ్ పద్దతిలో ఆడేందుకు అనుమతించాలని, ఐసీసీ ఆదాయంలో తన వాటాను పెంచాలని పీసీబీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఆ రెండు డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది.