AUS vs IND: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్ కు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు.

AUS vs IND: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్

Josh Hazlewood

Updated On : November 30, 2024 / 8:54 AM IST

Josh Hazlewood: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. ఇప్పటికే పెర్త్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. మరో నాలుగు టెస్టు మ్యాచ్ లు రెండు జట్ల మధ్య జరగనున్నాయి. రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్. అంటే డేనైట్ మ్యాచ్. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Also Read: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్‌.. ఆ కీల‌క‌ ప్లేయ‌ర్ టోర్నీకి దూర‌మైన‌ట్లేనా?

అయితే, రెండో టెస్టు సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో రెండు టెస్టు మ్యాచ్ కు ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లను జట్టులోకి తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే, హేజిల్ వుడ్ సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లకు సన్నద్ధమయ్యేందుకు ఆడిలైడ్ లోని జట్టుతోనే ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

Also Read: NZ vs ENG : 150వ టెస్టులో జోరూట్ డ‌కౌట్‌.. ఆనందంలో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఫ్యాన్స్‌..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 150 పరుగులకే ఆలౌట్ కావడంలో అతను కీలక భూమిక పోషించాడు. కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో  ఒక వికెట్ పడగొట్టాడు. అయితే, గత నాలుగేళ్ల క్రితం ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డేనైట్ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలింది. ఆ సమయంలో హేజిల్‌వుడ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాంటి ప్లేయర్, రెండో టెస్టుకు దూరమవడం ఆస్ట్రేలియా ఎదురు దెబ్బేనని చెప్పొచ్చు. అతను మూడో టెస్టు నుంచి అందుబాటులో ఉంటాడా లేదా అనేది స్పష్టత లేదు. గాయం నుంచి కోలుకోకుంటే సిరీస్ మొత్తానికి జోష్ హేజిల్ వుడ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.