IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్‌.. ఆ కీల‌క‌ ప్లేయ‌ర్ టోర్నీకి దూర‌మైన‌ట్లేనా?

ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకూడా ఉన్నాడు.

IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్‌.. ఆ కీల‌క‌ ప్లేయ‌ర్ టోర్నీకి దూర‌మైన‌ట్లేనా?

Mohammed Shami Injury

Updated On : November 30, 2024 / 7:57 AM IST

Mohammed Shami Injury: ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకూడా ఉన్నాడు. అయితే, షమీ గత ఏడాది కాలంగా గాయంతో బాధపడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఈ నెలలోనే ఏడాది తరువాత మైదానంలో అడుగుపెట్టి రంజీ ట్రోపీల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలో బెంగాల్ జట్టు తరపున మహ్మద్ షమీ ఆడుతున్నాడు. బౌలింగ్ లో రాణిస్తున్నప్పటికీ అతను పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉన్నాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, తాజాగా శుక్రవారం మరోసారి షమీ గాయపడినట్లు తెలుస్తోంది.

Also Read: Cricketer Dies : విషాదం.. బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణించిన బ్యాట‌ర్‌

బెంగాల్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఆడుతున్నాడు. శుక్రవారం నిరంజన్ షా స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీకి వెన్ను నొప్పి వచ్చింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా షమీ బంతిని ఆపేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. పడిపోయిన తరువాత షమీ అసౌకర్యంగా కనిపించాడు. దీంతో వైద్య చికిత్స అనంతరం షమీ లేచి తన ఓవర్ పూర్తి చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో మహ్మద్ షమీ టీమిండియాకు చివరి మ్యాచ్ ఆడాడు. దీని తరువాత చీలమండ గాయం కారణంగా సుమారు సంవత్సరం పాటు ప్రొఫెషనల్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్ కు కూడా షమీ దూరమయ్యాడు. షమీ ఫిట్ నెస్ తో ఉన్నాడని, ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తాడని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో అతన్ని ఆస్ట్రేలియా టూర్ కు పంపించేందుకు బీసీసీఐ వెనుకడుగు వేసింది. దీంతో ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నాడు. తాజాగా మరోసారి అతను గాయపడటంతో వచ్చే ఐపీఎల్ టోర్నీకి ఏమేరకు అందుబాటులో ఉంటాడనే అంశం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read: Faf du plessis : బుడ్డొడా.. ఎంత ప‌ని చేశావురా.. డుప్లెసిస్‌ని ఎత్తిపడేసిన కుర్రాడు..

ఓ నివేదిక ప్రకారం.. మహ్మద్ షమీ స్వల్ప గాయంకు గురయ్యాడని, ఇందులో ఎలాంటి తీవ్రమైన సమస్య లేదని పేర్కొంది. ఆదివారం మేఘాలయతో జరిగే మ్యాచ్ లో షమీ కనిపిస్తాడని నివేదిక తెలిపింది. అయితే, షమీ మరోసారి గాయపడినట్లు వార్తలు రావడంతో ఐపీఎల్ టోర్నీలో అతను ఆడే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహ్మద్ షమీ ఐపీఎల్ నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో బరిలోకి దిగుతాడా.. లేదా అనే విషయంపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.