Rohit Sharma Anger
Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. కెమెరామెన్ వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా మొఖంలో ఏముంది.. రిప్లే చూపించు అంటూ సైగలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma 9th Test Century: రోహిత్ శర్మ సెంచరీ బాదుడు.. మరో రికార్డు కొట్టేశాడుగా
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిటెస్టు మ్యాచ్‌లో భాగంగా మూడోరోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. అశ్విన్ విజృంభణతో ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ అశ్విన్ వేశాడు. హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో అశ్విన్ ఎల్బీ కోసం అంపైర్ ను అప్పీల్ చేశాడు. నాటౌట్ గా అంపైర్ నిర్ధారించాడు. కెప్టెన్ రోహిత్ డీఆర్ఎస్ తీసుకున్నారు.
Rohit Sharma: వరల్డ్ కప్ కోసం బలమైన జట్టు తయారు చేయడమే లక్ష్యం: భారత కెప్టెన్ రోహిత్ శర్మ
హ్యాండ్స్‌కాంబ్ ఔటా? కాదా? అనే విషయాన్ని థర్డ్ అంపైర్ పరిశీలన చేస్తున్నాడు. ఈ క్రమంలో లైవ్ కెమెరామెన్ రిప్లై చూపకుండా రోహిత్ శర్మ ముఖంవైపు కెమెరా ఫోకస్ చేశాడు. దీంతో అసహనం వ్యక్తంచేసిన రోహిత్ శర్మ.. నా మొఖంలో ఏముంది.. రిప్లై చూపించు అన్నట్లుగా సైగలు చేశాడు. దీంతో రోహిత్ పక్కనే ఉన్న సూర్యకుమార్ యాదవ్, షమీ, అశ్విన్లు చిరునవ్వులు చిందించడం కనిపించింది. అనంతరం రోహిత్ సైతం నవ్వుతూ కనిపించాడు. ఆ తరువాత రివ్యూలో హ్యాండ్స్‌కాంబ్ ఔట్ అయినట్లు థర్డ్ అంపైర్ డిక్లేర్ చేశాడు.
Mera ko kya dikha raha review dikha?? pic.twitter.com/7UMR2RdfZu
— Lala (@FabulasGuy) February 11, 2023