Rohit 250 sixes in IPL
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab kings )తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 27 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో మొత్తంగా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్(357) ఉండగా ఆ తరువాత దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్(357) ఉన్నారు. మూడో స్థానంలో రోహిత్ శర్మ(250) ఉండగా ఎంఎస్ ధోని (235), విరాట్ కోహ్లీ(229) లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌లో రోహిత్ ఇప్పటి వరకు 233 మ్యాచుల్లో 130.22 స్ట్రైక్ రేట్‌తో 6,058 పరుగులు చేశాడు. ఓ సెంచరీ 41 అర్థశతకాలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి.
IPL 2023, MI Vs PBKS: పరుగుల వరద.. ముంబై పోరాడినా పంజాబ్‌దే గెలుపు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించగా రోహిత్ శర్మ(44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో టిమ్ డేవిడ్(25 నాటౌట్; 13 బంతుల్లో 2సిక్సర్లు) లు జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
Rohit Sharma: రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. 6 వేల క్లబ్‌లో హిట్‌మ్యాన్