MI vs SRH : చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. వాంఖ‌డే సిక్స‌ర్ల కింగ్‌..

ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Courtesy BCCI

ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వాంఖ‌డే స్టేడియంలో 100 సిక్స్‌లు కొట్టిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. గురువారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

163 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ 16 బంతుల్లో 3 సిక్స‌ర్లు బాది 26 ప‌రుగులు సాధించాడు. అత‌డి స్ట్రైక్‌రేట్ 162.50గా ఉంది. ఈ క్ర‌మంలో అత‌డు వాంఖ‌డే స్టేడియంలో ఐపీఎల్‌లో 100 సిక్స్‌లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఓవ‌రాల్ తీసుకుంటే ఒకే వేదిక‌పై ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

MI vs SRH : స‌న్‌రైజ‌ర్స్ పై విజ‌యం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైర‌ల్‌.. అలా దెబ్బ‌కొట్టాం..

ఈ జాబితాలో రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు చిన్న‌స్వామి స్టేడియంలో 130 సిక్స్‌లు బాదాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియ‌ర్స్ ఉన్నారు.

ఐపీఎల్‌లో ఒకే వేదిక‌పై అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – చిన్న‌స్వామి స్టేడియంలో 130 సిక్స్‌లు
* క్రిస్‌గేల్ – చిన్న‌స్వామి స్టేడియంలో 127 సిక్స్‌లు
* ఏబీ డివిలియ‌ర్స్‌- చిన్న‌స్వామి స్టేడియంలో 118 సిక్స్‌లు
* రోహిత్ శ‌ర్మ – వాంఖ‌డే స్టేడియంలో 100 సిక్స్‌లు
* కీర‌న్ పొలార్డ్ – వాంఖ‌డే స్టేడియంలో 85 సిక్స్‌లు

MI vs SRH : క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను వెన‌క్కి పంపించి మ‌రీ.. ఔటైన బ్యాట‌ర్‌ను వెన‌క్కి ర‌ప్పించిన థ‌ర్డ్ అంపైర్‌.. ఎందుకిలా చేశాడో తెలుసా?

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు సాధించింది. అభిషేక్ శ‌ర్మ (40; 28 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (37; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో విల్ జాక్స్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌, బుమ్రా, పాండ్యాలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ల‌క్ష్యాన్ని ముంబై 18.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ర్యాన్ రికెల్టన్ (31; 23 బంతుల్లో 5 ఫోర్లు), విల్ జాక్స్ (36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (26; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (26; 16 బంతుల్లో 3 సిక్స‌ర్లు) లు రాణించారు.