MI vs SRH : సన్‌రైజర్స్ పై విజయం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్.. అలా దెబ్బకొట్టాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్‌లో 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్ల ప్రదర్శన వల్లే ఈ మ్యాచ్‌లో తాము గెలిచిచామని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. పిచ్ కండిషన్స్‌కు తగినట్లు ఎంతో తెలివిగా బౌలింగ్ చేశారన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
IPL 2025: మేం చేసిన తప్పు అదే.. అందుకే ఓడాం.. ముంబైపై ఓటమి తరువాత పాట్ కమిన్స్ కీలక కామెంట్స్
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ రోజు మా బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం బాగుంది. ఎంతో తెలివిగా బౌలింగ్ చేశారు. పిచ్ కండిషన్స్‌కు తగినట్లుగా బంతులు వేశారు. బేసిక్స్ కు కట్టుబడి బౌలింగ్ చేశారని అన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లను షాట్స్ ఆడకుండా కట్టడి చేశారని మెచ్చుకున్నాడు. ఇందుకు బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని హార్దిక్ అన్నాడు
పిచ్ మీద పచ్చిక ఉందన్నాడు. దీపక్ చాహర్ వేసి తొలి ఓవర్‌లోనే బంతి ఆగుతూ వెళ్లడం గమనించినట్లు తెలిపాడు. వెంటనే స్లో బాల్స్ వేయాలని అనుకున్నామని, దానికి తగినట్లుగానే బౌలింగ్‌లో వేరియషన్స్ ప్రారంభించామని చెప్పాడు. విల్ జాక్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అతడు ఎంతో కీలక ఆటగాడన్నాడు. అతడు జట్టులో అంతర్భాగమని, అతడికి కావాల్సిన మద్దతును అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఈ పిచ్ పై 42 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన సమయంలోనూ కాస్త కష్టం అని భావించాము. అందుకనే కాస్త సమయం తీసుకుని ఆడాము. బౌండరీలు కొడితే ఒత్తిడి తగ్గుతుందని తెలుసునని, అందుకనే ఆఖర్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినట్లుగా హార్దిక్ తెలిపాడు.