IPL 2025: మేం చేసిన తప్పు అదే.. అందుకే ఓడాం.. ముంబైపై ఓటమి తరువాత పాట్ కమిన్స్ కీలక కామెంట్స్
మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Pat Cummins
SRH vs MI : ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఇది మూడో విజయం.
Also Read: IPL 2025 : సలైవా గేమ్ ఛేంజరా? సూపర్ ఓవర్ హీరో మిచెల్ స్టార్క్ షాకింగ్ ఆన్సర్..
తొలుత సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు అభిషేక్ శర్మ (40), ట్రావిస్ హెడ్ (28) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో సన్‌రైజర్స్ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించారు. చివరిలో క్లాసెన్ (37) దూకుడుగా ఆడే ప్రయత్నంచేసి ఔట్ అయ్యాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి విజయం సాధించింది.
Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టై..
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. మేము తక్కువ పరుగులు చేశాం. ఈ పిచ్ అంత తేలిగ్గా లేదు. కష్టంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసిఉంటే బాగుండేది. 160 పరుగులు సాధించినప్పటికీ తక్కువగానే అనిపించింది. మా బౌలింగ్ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. డెత్ ఓవర్లలో మంచి బౌలర్లు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఒకటి రెండు ఓవర్లు వేసేలా ప్లాన్ చేసుకున్నాం. అందుకే రాహుల్ ను పంపించాం.
ఫైనల్ చేరాలంటే హోమ్ గ్రౌండ్ తో పాటు బయట మైదానాల్లోనూ బాగా ఆడాలి. కానీ, అలా జరగట్లేదు. తిరిగి పుంజుకుంటాం. మా వాళ్లు పవర్ ప్లే లో జాగ్రత్తగా ఆడారు. అనవసరమైన హిట్టింగ్ చేయలేదు. మా నెక్ట్స్ మ్యాచ్ హోంగ్రౌండ్ లో జరుగుతుంది. ఆ పిచ్ పై మాకు మంచి అవగాహన ఉంది అంటూ పాట్ కమిన్స్ పేర్కొన్నారు.
Hardik Pandya picked a wicket tonight and scored 21 (9).
– Kung Fu Pandya on show! 💥pic.twitter.com/jWL21Y59YV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2025