IPL 2025 : సలైవా గేమ్ ఛేంజరా? సూపర్ ఓవర్ హీరో మిచెల్ స్టార్క్ షాకింగ్ ఆన్సర్..
బంతికి లాలాజలం వాడటం వల్ల బౌలర్లకు అనుకూలం అనే వాదనపై స్టార్క్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ విజయంలో ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.
189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్ లో 9 పరుగులే అవసరం. అయితే.. స్టార్క్ చక్కని బంతులు వేశాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఈ ఓవర్‌లో 8 పరుగులే వచ్చాయి. మ్యాచ్ టైగా మారడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లోనూ సత్తా చాటిన స్టార్క్ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు బంతుల్లో ఛేదించింది.
DC vs RR : ఏందీ భయ్యా.. ఇక్కడ కూడానా.. సూపర్ ఓవర్‌లో పరాగ్ కామెడీ రనౌట్.. వీడియో వైరల్
తన విజయంలో సెలైవా (లాలాజలం లేదా ఉమ్ము) కీలక పాత్ర పోషించందనే వాదనను స్టార్క్ తోసిపుచ్చాడు. తాను సెలైవాను వాడనని చెప్పాడు. బంతికి చెమటను ఎక్కువగా పూసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా ఐదేళ్ల కిందట నుంచి ఐపీఎల్‌లో సెలైవా పై నిషేదం విధించారు. ఐపీఎల్ 2025 సీజన్‌తో మళ్లీ దీన్ని ప్రవేశపెట్టారు.
ఉమ్మి వల్ల ఏదో ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని స్టార్క్ అన్నాడు. ఉమ్మికి, చెమటకు పెద్దగా తేడా ఉండదన్నాడు. ఎర్ర బంతిపై అది ప్రభావం చూపిస్తుందేమోగానీ, తెల్ల బంతి పై కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగానని, వాటిని సరిగ్గా అమలు చేశానని చెప్పుకొచ్చాడు. సూపర్ ఓవర్‌కు వెళ్లడం భలేగా ఉందని, నోబాల్ వేసినా వెంటనే పుంజుకున్నామన్నాడు. రనౌట్ రూపంలో రెండు వికెట్లు దక్కాయని, మిగిలిన పనిని బ్యాటర్లు అలవోకగా చేశారన్నాడు. అక్షర్ పటేల్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ యాదవ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. ఇక స్టబ్స్, కేఎల్ రాహుల్‌లకు చాలా అనుభవం ఉందన్నాడు.