Rohit Sharma
Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..! ఇటీవల రవిచంద్ర అశ్విన్ తరహాలోనే రోహిత్ నిర్ణయం తీసుకోబోతున్నారా.. ఆమేరకు ఆయనపై ఒత్తిడి పెరుగుతుందా.. భారత జట్టులో అసలేం జరుగుతుంది.. హుటాహుటీన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మెల్ బోర్న్ ఎందుకు చేరుకున్నారు.. ఇలా అనేక ప్రశ్నలు ప్రస్తుతం టీమిండియా అభిమానులు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. గత కొన్ని నెలలుగా రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడుతుంది. రోహిత్ ఏ స్థానంలో వచ్చినా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గడిచిన రెండు టెస్టుల్లోనూ.. ప్రస్తుతం మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనూ రోహిత్ పరుగులు చేయడంలో విపలమయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ కూడా మెల్బోర్న్ చేరుకోవటంతో రోహిత్ రిటైర్మెంట్ గురించి మాట్లాడటానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: IND vs AUS 4th test : ముగిసిన రెండో రోజు ఆట.. కష్టాల్లో భారత్.. పొంచి ఉన్న ఫాలో ఆన్ గండం..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్ టీమిండియా విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్టు డ్రా అయింది. ప్రస్తుతం మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తుంది. అయితే, ఈ సిరీస్ ప్రారంభం నుంచి పరుగులు రాబట్టడంలో వరుసగా విఫలం అవుతూ వస్తున్న రోహిత్ శర్మ తాజాగా మరోసారి విఫలం చెందాడు. ఈ సిరీస్ లో నాలుగు ఇన్నింగ్స్ లో కేవలం 22 పరుగులు మాత్రమే రోహిత్ చేయగలిగాడు. టెస్టు ఫార్మాట్ లో చివరి 14 ఇన్నింగ్స్ లలో 11.07 సగటుతో 155 పరుగులు మాత్రమే రోహిత్ చేయగలిగాడు.
Also Read: IND vs AUS 4th test : ముగిసిన రెండో రోజు ఆట.. కష్టాల్లో భారత్.. పొంచి ఉన్న ఫాలో ఆన్ గండం..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తరువాత రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారంలో ఉంది. అయితే, తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టిచూస్తే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఖాయమని తెలుస్తోంది. టీమిండియా పేలవమైన ప్రదర్శన మధ్య, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మెల్బోర్న్ చేరుకోవటం చర్చనీయాంశంగా మారింది. పీటీఐ నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు అగార్కర్ హటాహుటీన మెల్బోర్న్ చేరుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించకపోతే బోర్డర్ గావస్కర్ చివరి టెస్టులో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి టోర్నీలో స్వేచ్చగా ఆడేందుకు రోహిత్ తో అగార్కర్ మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఇటీవల ఉన్నట్లుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఆయన రిటైర్మెంట్ ప్రకటించేలా బలవంతం చేశారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అశ్విన్ రిటైర్మెంట్ తరువాత క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మపైకూడా అశ్విన్ తరహాలో రిటైర్మెంట్ ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతున్నట్లు రోహిత్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాపరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అజిత్ అగార్కర్ రోహిత్ గురించి ఏం ప్రకటించబోతున్నారన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.