Rohit Sharma
CSK vs MI IPL 2024 : ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షాకిచ్చింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20పరుగుల తేడాతో సీఎస్కే జట్టు గెలిచింది. తద్వారా ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై నాల్గో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై జట్టు ఆరంభం నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే, రోహిత్ శర్మ (105 నాటౌట్ 63బంతుల్లో) వీరోచిత పోరాటంతో చివరి వరకు క్రీజులో ఉండటంతో చివరి ఓవర్ వరకు ముంబై జట్టు అభిమానులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరికి 20 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓడిపోయింది.
Also Read : IPL 2024 : రుతురాజ్, దూబె విజృంభణ.. ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై విజయం!
ఈ మ్యాచ్ లో ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. సీఎస్కే 11 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, దూబే ఉన్నారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. 12వ ఓవర్లో మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో బౌండరీలైన్ వద్ద ఉన్న రోహిత్ శర్మ డ్రైవ్ చేసి క్యాచ్ అందుకొనే ప్రయత్నంలో విఫలమయ్యాడు. కానీ, బంతి బౌండరీ లైన్ తాకకుండా ఆపాడు.. ఈ క్రమంలో అతని ప్యాంటు ఊడిపోయింది. ఒక చేతిలో బంతి, మరో చేతిలో జారిపోతున్న ప్యాంటు ఉండటంతో రోహిత్ తొలుత బంతిని బౌలర్ వైపు విసిరి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్యాంటు సరిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : చెలరేగిన స్టార్క్, సాల్ట్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై కేకేఆర్ భారీ గెలుపు
https://twitter.com/ClassicalKohli/status/1779527380052390235?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1779527380052390235%7Ctwgr%5E6c85db3d53596fea1b227d1f5f8f3340b69f89d5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.lokmat.com%2Fcricket%2Fnews%2Fipl-2024-mumbai-indians-vs-chennai-super-kings-live-marathi-embarrassing-movement-for-rohit-sharma-he-dropped-ruturaj-gaikwad-catch-video-a-a593%2F
Also Read : MI vs CSK : హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోని సిక్స్.. రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే
https://twitter.com/daacsaabh/status/1779526970717741514?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1779526970717741514%7Ctwgr%5E6c85db3d53596fea1b227d1f5f8f3340b69f89d5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.lokmat.com%2Fcricket%2Fnews%2Fipl-2024-mumbai-indians-vs-chennai-super-kings-live-marathi-embarrassing-movement-for-rohit-sharma-he-dropped-ruturaj-gaikwad-catch-video-a-a593%2F
Crowd started Chanting "Rohittttt Rohitttt" after that outstanding effort of Rohit Sharma 🔥🔥
Crowd is behind Rohit Sharma.🐐 pic.twitter.com/Oas4Wdsrxm
— ` (@45Fan_Prathmesh) April 14, 2024