MI vs CSK : హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోని సిక్స్‌.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ ఇదే

ఐపీఎల్ 2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని అద‌ర‌గొడుతున్నాడు.

MI vs CSK : హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోని సిక్స్‌.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ ఇదే

Rohit Smiling As Dhoni Hits Hardik Pandya For 1st Ball Six in MI vs CSK

Mumbai Indians vs Chennai Super Kings : ఐపీఎల్ 2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని అద‌ర‌గొడుతున్నాడు. ఆఖ‌రిలో వ‌స్తూ త‌న‌దైన స్టైల్‌లో ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్నాడు. ఇక ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మ‌హేంద్రుడు చెల‌రేగిపోయాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఆఖ‌రి నాలుగు బంతులు ఉండ‌గా క్రీజులో అడుగుపెట్టిన 42 ఏళ్ల ధోని విజృంభించి ఆడాడు. వ‌రుస‌గా హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాది చెన్నై స్కోరును 200 దాటించాడు. నాలుగు బంతుల్లో 20 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ధోని హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్ట‌డంతో స్టేడియం మొత్తం ధోని నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిపోయింది. కాగా.. ధోని మొద‌టి సిక్స్ కొట్టిన‌ప్పుడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇచ్చిన రియాక్ష‌న్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ఘా మారింది.

Ruturaj Gaikwad : “కుర్రాడు ధోని” సిక్సులే కాపాడాయి : రుతురాజ్ గైక్వాడ్‌

హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఔట్ కావ‌డంతో ధోని క్రీజులోకి వ‌చ్చాడు. తాను ఎదుర్కొన్న మొద‌టి బంతినే ధోని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ స‌మ‌యంలో ధోని అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో ఉన్న ధోని స‌హ‌చ‌రుడు రోహిత్ శ‌ర్మ ముఖంలో చిరున‌వ్వు క‌నిపించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 బంతుల్లో 69), శివమ్‌ దూబె (38 బంతుల్లో 66 నాటౌట్‌) ల‌తో పాటు ధోని ( 4 బంతుల్లో 20 నాటౌట్‌) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్లో ఆరు వికెట్లు కోల్పోయి 186 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ముంబై బ్యాట‌ర్లో రోహిత్ శ‌ర్మ (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. ఓ ప‌క్క‌న అత‌డు ధాటిగా ఆడుతున్నా మ‌రో ప‌క్క అత‌డికి స‌హ‌క‌రించే వారే క‌రువు అయ్యారు. రోహిత్ ఆఖ‌రి వ‌ర‌కు నిలిచినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు.

Sunil Gavaskar : హార్దిక్‌ది చెత్త బౌలింగ్‌.. అత‌డి వ‌ల్లే ఓట‌మి : నయా కెప్టెన్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్‌