Sunil Gavaskar : హార్దిక్‌ది చెత్త బౌలింగ్.. అతడి వల్లే ఓటమి : నయా కెప్టెన్ పై సునీల్ గవాస్కర్ ఫైర్
ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Sunil Gavaskar Blasts Hardik Pandya After MS Dhonis Fiery Knock
Sunil Gavaskar – Hardik Pandya : ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్యనేని సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ హార్దిక్‌దేనని అన్నాడు. ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌పై గవాస్కర్ గవాస్కర్ మాట్లాడాడు.
‘గత కొంతకాలంగా నేను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదే. నా హీరో కోసం సమర్పించుకుంటాను అన్నట్లుగా అతడి బౌలింగ్ కనిపించింది. అతడు ఎలా వేస్తే సిక్సర్లు కొడతాడో అలాంటి బంతులనే వేశాడు. మూడు సిక్సర్లలో ఓ సిక్సర్ ఫర్వాలేదు. అయితే.. ఆ తరువాత బంతిని లెగ్త్ బాల్ వేశాడు. ఆ మరుసటి బంతి లెగ్ సైడ్ ఫుల్ టాస్ వేశాడు. ఇందుకోసమే వేచి చూస్తున్న బ్యాటర్ వాటిని సిక్సర్లుగా మలిచాడు. ఇది ఖచ్చితంగా సాధారణమైన బౌలింగ్, పేలవమైన కెప్టెన్సీ. చెన్నైను 185 నుంచి 190 పరుగుల మధ్య కట్టడి చేయాల్సింది.’ అని గవాస్కర్ అన్నాడు.
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత.. ధోని, కోహ్లిల వల్ల కాలేదు..
ఇక మ్యాచ్‌కు ముందు హార్దిక్, ధోనీ మధ్య జరిగిన పరస్పర చర్యను కూడా గవాస్కర్ ప్రస్తావించాడు. హార్దిక్ ధోనీ వద్దకు పరిగెత్తి మాజీ భారత కెప్టెన్‌ను కౌగిలించుకున్న క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌కు వచ్చే సరికి రోహిత్ శర్మ సెంచరీ వృధాగా పోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ధోని (20 నాటౌట్; 4 బంతుల్లో 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు కోల్పోయి 206 పరుగులు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 నష్టానికి 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ (105 నాటౌట్; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఓ పక్కన అతడు ధాటిగా ఆడుతున్నా మరో పక్క అతడికి సహకరించే వారే కరువు అయ్యారు. రోహిత్ ఆఖరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సీఎస్‌కే బౌలర్ మతీషా పతిరనా నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు.
IPL 2024 : ఒక చేతిలో ప్యాంటు.. మరో చేతిలో బంతి.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో వైరల్