Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, కోహ్లిల వ‌ల్ల కాలేదు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, కోహ్లిల వ‌ల్ల కాలేదు..

pic credit @ csk twitter

Ruturaj Gaikwad 2000 IPL runs : చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 2 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మొద‌టి భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ 69 ప‌రుగుల‌తో రాణించాడు. ఈ క్ర‌మంలో కేఎల్ రాహుల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

2 వేల ప‌రుగులు పూర్తి చేసేందుకు రాహుల్‌కు 60 ఇన్నింగ్స్ అవ‌స‌రం కాగా రుతురాజ్ కేవ‌లం 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక ఓవ‌రాల్‌గా చూసుంటే క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు), షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్‌లు)ల త‌రువాత మూడో ఆట‌గాడిగా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రుతురాజ్ 58 మ్యాచులు ఆడాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో 134.91 స్ట్రైక్‌రేటుతో 39.62 స‌గ‌టుతో 2,021 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 16 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. కాగా.. ఈ ప‌రుగులు అన్ని చెన్నై త‌రుపునే చేయ‌డం విశేషం.

MS Dhoni : ఎంఎస్ ధోని చారిత్ర‌క రికార్డు.. ఐపీఎల్‌లో తొలి భార‌తీయుడు..

నాలుగో ఆట‌గాడిగా..

ఐపీఎల్‌లో చెన్నై తరుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రుతురాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా 176 మ్యాచుల్లో 4,687 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా ఎంఎస్ ధోని (226 మ్యాచుల్లో 4,547 ప‌రుగులు), ఫాప్ డుప్లెసిస్ (92 మ్యాచుల్లో 2,721 ప‌రుగులు) ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు కోల్పోయి 206 పరుగులు సాధించింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 బంతుల్లో 69), శివమ్‌ దూబె (38 బంతుల్లో 66 నాటౌట్‌) దంచికొట్టారు. ధోని (4 బంతుల్లో 20 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం ల‌క్ష్య‌ ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 న‌ష్టానికి 186 పరుగులకే ప‌రిమిత‌మైంది. రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్‌) శ‌త‌కంతో రాణించాడు.

IPL 2024 : ఒక చేతిలో ప్యాంటు.. మరో చేతిలో బంతి.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో వైరల్